English | Telugu

ఏంజిల్ ఆసియా ఫ్రాంక్ చేయడంతో నూకరాజు గొడవ!

ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది.

నూకరాజు, ఏంజిల్ ఆసియా కలిసి రెగ్యులర్ వ్లాగ్ లు చేస్తూ తమ 'ఏంజిల్ ఆసియా' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన వ్లాగ్స్ కి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఈ మధ్య వీళ్ళిద్దరు కలిసి చేసిన "ఎంగేజ్ మెంట్ కోసం రెడీ అయ్యాం", " మా లవ్ మ్యాటర్ పైన క్లారిటీ", "బక్రీద్ స్పెషల్" వ్లాగ్స్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాంతో వీళ్ళు తాజాగా మరొక వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. నూకరాజు కి తెలియకుండా అతనిపై ఏంజిల్ ఆసియా ఫ్రాంక్ చేసింది. అయితే కెమెరాని చూడకుండా నూకరాజు బయటికి ఎలా ఉంటాడో అలా కన్పించాడు. బయట ఒక అమ్మాయి ఎవరినైనా ఏమీ లేదని డబ్బులు కావలని అడిగితే లేదనకుండా ఇచ్చిన నూకరాజు మానవత్వాన్ని పలువురు పొగిడేస్తున్నారు. ఆసియా చేసింది ఫ్రాంక్ అయిన నూకరాజులోని మంచితనాన్ని బయటకు తెలియజేసిందంటూ నెటిజన్లు ఈ వీడియోకి కామెంట్లు చేస్తున్నారు.‌ కాగా ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.