English | Telugu
కావ్య, కళ్యాణ్ లను పోలీస్ స్టేషన్ నుండి విడిపించిన రాజ్!
Updated : Jul 13, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -146 లో రాజ్ దగ్గరికి శృతి డిజైన్స్ తీసుకొని వస్తుంది. ఆ డిజైన్స్ చూసి చిరాగ్గా ఏంటి నీకు డిజైన్స్ వెయ్యడం వచ్చా ఒక్కోసారి బాగా వేస్తావ్.. ఒక్కో సారి ఇలా వేస్తావ్.. మొన్న వేసిన డిజైన్ నువ్వు వేసిందేనా అని డౌట్ వచ్చి వెళ్లి నాకు తొందరగా మంచి డిజైన్స్ రెడీ చేసి తీసుకొని రా అని శృతితో చెప్పి పంపిస్తాడు.
ఆ తర్వాత రాజ్ కి స్టేషన్ ఎస్ఐ ఫోన్ చేసి.. మీ భార్య మీ తమ్ముడు స్టేషన్ లో ఉన్నారు రండి అని చెప్తాడు. ఈ తింగరిది మళ్ళీ ఏం పని చేసిందో అని రాజ్ బయలుదేర్తాడు. మరొక వైపు ఇందిరా దేవి, అపర్ణ, ధాన్యలక్ష్మి హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటారు. అప్పుడు అక్కడికి స్వప్న వచ్చి రిమోట్ తీసుకొని ఛానల్ చేంజ్ చేస్తుంటుంది. ఏంటి స్థిరంగా ఉండలేవా అని అపర్ణ అంటుంది. స్వప్న చిరాకు పడుతు.. నా బాధ ఎవరు పట్టించుకుంటారని అంటుంది. ఏంటి నీ బాధ అని ఇందిరాదేవి అడుగుగా.. నా భర్త నాతో ప్రేమగా ఉండట్లేదు.. నన్ను పట్టించుకోవడం లేదని స్వప్న అంటుంది. అప్పుడే అక్కడికి రాహుల్ రుద్రాణి వస్తారు. నీ ప్రాబ్లమ్ ఏంటి డైరెక్ట్ చెప్పమని రుద్రాణి అడుగుతుంది.
హనీమున్ కి నన్ను తీసుకొని వెళ్లడం లేదని స్వప్న అంటుంది. హనీమూన్ కి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి వెళ్తారు. నువ్వు పెళ్లి ముందే ప్రెగ్నెంట్ అయ్యావ్. ఇప్పుడు హనీమూన్ కి ఎలా వెళ్తావని రుద్రాణి అంటుంది... అవును నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం మాటి మాటికి మేము గుర్తుచేయాల్సి వస్తుంది. నీ జాగ్రత్తలు నీకు తెలియావా అని ఇందిరాదేవి అంటుంది. ఏంటి నాకు కడుపు లేదన్న విషయం నేనే బయట పెట్టుకునేలా ఉన్నా అని స్వప్న తనలో తానే అనుకుంటుంది.
మరొక వైపు రాజ్ స్టేషన్ కి వెళ్లేసరికి.. కావ్య లేడీ కానిస్టేబుల్ తో చుక్కల ముగ్గు ఎలా వెయ్యాలో నేర్పిస్తుంటే, కళ్యాణ్ మరొక కానిస్టేబుల్ తో తన కవిత్వలు చెప్తూ ఉంటాడు. ఎస్ఐ దగ్గరికి వెళ్లిన రాజ్.. జరిగింది తెలుసుకోని కమీషనర్ తో రికమండ్ చేపిస్తాడు. ఆ తర్వాత కావ్య, కళ్యాణ్ లను బయటకు తీసుకొని వస్తాడు. మరొకవైపు స్వప్న ప్రెగ్నెంట్ తో ఉండగా సూడిగం తీసుకొని వెళ్ళాలని అనుకుని డబ్బులు గురించి ఆలోచిస్తుంది కనకం. మరొక వైపు.. మీరు చేసేదేంటని కావ్యని రాజ్ అడుగుతాడు. " ఏం లేదు అన్నయ్య.. వదిన కార్ డ్రైవింగ్ నేర్చుకుంటా అంటే నేర్పిస్తున్నా" అని కళ్యాణ్ అంటాడు. డ్రైవింగ్ అనేది ఎవరు లేని ప్లేస్ లో నేర్చుకోవాలి. ఇలాగ క్రౌడ్ ఉన్న దగ్గర కాదని రాజ్ వాళ్లిద్దరిపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.