English | Telugu

పెళ్ళై ఆరు నెలలు కాలేదు...భర్తను ద్వేషిస్తున్నానంటూ పోస్ట్ పెట్టిన నేహా చౌదరి


బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఎవరో ఒకరు ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. ఎన్ని సీజన్స్ గడిచినా కూడా ఆడియన్స్ మాత్రం వాళ్ళను అస్సలు మర్చిపోలేరు. అలాంటి వాళ్ళల్లో గీతూ రాయల్, బాలాదిత్య, నేహా అని చెప్పుకోవచ్చు. అలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో నేహా పొడుగు కాళ్ళ సుందరిగా పేరు తెచ్చుకుంది. ఆమె ఒక యాంకర్, డ్యాన్సర్, యోగా ట్రైనర్, జిమ్నాస్ట్‌తో పాటు అథ్లెట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక ఆమె వివాహం చేసుకుంది. ఇంజనీరింగ్ చేసే టైంలోనే తాను ఎంతో ఇష్టపడిన అనిల్ అనే అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. అనిల్ జాబ్ జర్మనీలో కావడంతో అతనితో కలిసి జర్మనీ వెళ్లిపోయింది.

ఆమె యూట్యూబ్ చూస్తే చాలు ఆమె అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి. జర్మనీలోని విషయాలను, విశేషాలను కూడా అన్నీ వీడియోస్ చేస్తుంది. తన ప్రియమైన భర్తతో కలిసి ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఉంటుంది. మరి ఇద్దరి మధ్య ఏమయ్యిందో కానీ రీసెంట్ గా ఒక పోస్ట్ ఐతే పెట్టింది నేహా చౌదరి. "ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను ఎంతో ద్వేషిస్తున్నాను. అందుకే అనుకుంటా దీన్ని పెళ్లి అని పిలుస్తారు. నువ్వు ఎంత పెద్దగా గురక పెట్టినా, నన్నునీ కారు నడపనివ్వకపోయినా, నీ డెజర్ట్ ని నాతో షేర్ చేసుకోకపోయినా, .. నేను చెప్పిన పని ఏదీ చేయకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నువ్వు ఇక అలా చేయను అని నాకు సారి చెప్పి ..మాటిచ్చిన ఐదు నిమిషాలకే మాట తప్పుతావు. అయినప్పటికీ.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ప్రేమించే విధానానికి నేను పడిపోయా. నువ్వు ఎప్పటికీ నావాడివే’ అని ఇన్ స్టాలో తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.