English | Telugu
ఆకులు మేకలే కాదు.. నేను కూడా తింటున్నా!
Updated : Jul 12, 2023
బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ.
సుమ కనకాల.. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. ఈ మధ్య స్పీడ్ బోట్ లో వెళ్తూ వ్లాగ్ చేసి ట్రెండింగ్ లో నిలిచింది సుమ. ఆ తర్వాత బంగాళాదుంపల ఫ్రైని 'ఫ్రెంచ్ ఫ్రై' అని అమ్మేస్తున్నారంటూ సుమ ఒక వీడియోని పోస్ట్ చేయగా అది కూడా వైరల్ అయింది.
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది సుమ. "పుష్ప సినిమాలో ఏం చెప్పారు. ఆకులు తింటది మేక , మేకను తింటది పులి.. ఆకులు మేకలే కాదు మనుషులు కూడా తింటారు. ఇదిగో చూడండి నేను తింటున్నాను" అంటూ సుమ సలాడ్ తింటున్న వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ వీడియోకి అత్యధికంగా కామెంట్లు వస్తున్నాయి. 'నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటి అక్క' అని ఒకరు కామెంట్ చేయగా, 'మనల్ని మనుషలు అని ఎవరన్నారు సుమ' అని మరొకరు, 'ఎంత సంపాదిస్తే ఏం లాభం, మీరు మాలా నచ్చిందేదీ తినలేరు' అంటూ కామెంట్ చేశారు. ఇలా కొన్ని ఫన్నీ కామెంట్లతో ఈ వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇలా రెగ్యులర్ గా ట్రావెల్ వ్లాగ్స్, ప్రమోషన్స్, కుకింగ్ వ్లాగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సుమ.