English | Telugu

అమ్మను చాలా మిస్సవుతున్నా... అయ్యగారే నంబర్ వన్

అల్లరి పిల్ల విష్ణుప్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే బుల్లితెర మీద అల్లరి చేస్తూ గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూనే. ఈమె రీసెంట్ గా జెడి చక్రవర్తితో కలిసి "దయ"అనే మూవీ చేసింది. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" అంటూ అందరిని పలకరించింది. చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు " మీ అమ్మ గురించి చెప్పు" అనేసరికి "నేను అమ్మ జోక్స్ ని, హగ్స్ ని, ముద్దుల్ని మిస్సవుతున్నా..ఫిజికల్లీ నేను అమ్మను చాలా మిస్ అవుతున్నా. కానీ ఉన్నన్నాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది" అని చెప్పింది.

"ఇషా ఫౌండేషన్ మీద నీ అభిప్రాయం ఏమిటి" " ప్రతీ రోజూ కొత్తగా పుట్టడమే" అని అంది. "ఆంధ్రా ఫుడ్ లో నీకు ఇష్టమైనది ఏమిటి" "బీరకాయ పచ్చడి..ముద్దపప్పు ఆవకాయ్, బెండకాయ ఫ్రై" అని చెప్పింది. "మీ క్రష్ ఎవరు" " ప్రస్తుతానికి చాలా మంది ఉన్నారు" అని సిగ్గు పడే ఎమోజిస్ ని పోస్ట్ చేసింది. "మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు" "ఇంకెవరు ఎప్పటికీ అయ్యగారే నంబర్ వన్" అంటూ అక్కినేని అఖిల్ ఫోటో పెట్టింది. "ఇష్టమైన ఫేవరేట్ ప్లేస్ ఏది" "నచ్చిన వ్యక్తి దగ్గర ఉండడం ఫేవరేట్ ప్లేస్" అని చెప్పింది. ఇలా తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పి ఈరోజుకి ఇంతే మళ్ళీ కలుద్దాం అని బై బై చెప్పింది విష్ణు ప్రియా. ఇక విష్ణుప్రియ మానస్ తో కలిసి "జరీజరీ" అనే కవర్ సాంగ్ చేసింది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ‘గంగులు’ అనే మరో సాంగ్ తో కూడా వీళ్ళు అలరించారు. విష్ణుప్రియ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ని , రీల్స్ ని షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.