English | Telugu

 జడ్జెస్ తో నటరాజ్ మాష్టర్ రచ్చ...ఉంటారా, ఉండరా అని సీరియస్ ఐన రాధ  

'నీతోనే డ్యాన్స్'.. అనే డాన్స్ షో ఇప్పుడిప్పుడే కొంచెం పికప్ అవుతోంది. ఈ వారం నుంచే ఎలిమినేషన్స్ రౌండ్ కూడా స్టార్ట్ అయ్యింది. అందులో మొదటిగా యాదమ్మ రాజు- స్టెల్లా ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు సైలెంట్ గా నటరాజ్ మాష్టర్ ఒక్కసారిగా వైలెంట్ గా ఇపోయారు. నటరాజ్ మాష్టర్ రాధ మీద ఫైర్ ఐన విషయాన్ని నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమోలో చూడొచ్చు. ఇక నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్ లో ప్రాపర్టీ రౌండ్ థీమ్ తో రాబోతోంది. కంటెస్టెంట్స్ అంతా ప్రాపర్టీస్ వాడి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఐతే ప్రోమో ఫైనల్ లో మాత్రం మాములుగా లేదు. నటరాజ్ మాష్టర్ -నీతూ జోడి చేసిన డ్యాన్స్ చూసి "ఇప్పటివరకు చూసిన ఈ మొత్తం సీజన్‌లో నాకు ఇది పూరెస్ట్ పెర్ఫామెన్స్‌లా అనిపించింది.." అని సదా అన్నారు. "టోటల్ బ్యాడ్.. ఐయామ్ సారీ.." అని రాధ కూడా జడ్జిమెంట్ ఇచ్చేసరికి నటరాజ్ మాష్టర్ ఇక సీరియస్ ఇపోయారు.

"నేను తప్పు చేస్తే హండ్రెడ్ పర్సంట్ తలవంచి సారీ అని చెప్పేస్తాను.. ఇక్కడ నా మిస్టేక్ కాదు ...వాళ్లది మిస్టేక్.. నేను ఏదో చేసేయాలి.. నా పైత్యమంతా ఇక్కడ రుద్దాలని రాలేదు.. ఎంటర్‌టైన్‌మెంట్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్.." అంటూ మాట్లాడబోతుండగా రాధ గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు. "మీకో విషయం తెలుసా.. మీ అందరి కంటే.. మా ముగ్గురి కంటే చాలా మంచి టాలెంట్స్ ఉన్న వాళ్లు ఈ ఫీల్డ్‌లో ఉన్నారు.. వాళ్లకు లేని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి.. మనం వచ్చాము అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం.. మీరు లక్కీ, మేము లక్కీ.." అంటూ కూల్ చేయడానికి ట్రై చేశారు. కానీ నటరాజ్ మాష్టర్ మాత్రం ఇంకా సీరియస్ గా "నా తప్పు కాదు మేడమ్.. నేను పడను.." అని చెప్పేశారు. "ఓకే మీరు ఇక్కడ డ్యాన్స్ చేయడానికి వచ్చారా..అసలు మీరు ఇక్కడ ఉంటారా లేదా అది.." చెప్పండి అంటూ రాధ చిరునవ్వుతోనే అడిగేసరికి నటరాజ్ మాష్టర్ తల వంచుకుని నిలబడ్డారు. మరి ఇంతకు అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.