English | Telugu

సిరి పోస్ట్ చేసిన బోల్డ్ ఫోటోస్  అందుకేనా!

సిరి హనుమంత్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బ్యూటీ. బిగ్ బాస్ సీజన్-5 లో ఫైనలిస్ట్ వరకు వచ్చి వెనుతిరిగింది‌. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన ఫ్యాన్ బేస్ మాములుగా ఉండేది కాదు. ప్రతీ వారం తనే టాప్ లో ఉండేది. టాస్క్ లో, గేమ్స్ లో యాక్టివ్ గా ఉండేది. అయితే షణ్ముఖ్ జస్వంత్ తో తను చనువుగా ఉంటూ వచ్చేది. దాంతో తనకి నెగెటివిటి పెరిగి బయటకు వచ్చేసింది.

సిరి బిగ్ బాస్ కు వెళ్ళేకంటే ముందు నుండి యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ లతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చాక సెలెబ్రిటి లిస్ట్ లో చేరింది. దాంతో వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన సిరి.. ఓటిటి వెబ్ సిరీస్ లో శ్రీహాన్ తో కలిసి చేస్తున్నట్టుగా ముందుగానే చెప్పింది. కాగా జీ5 లో రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న 'పులి-మేక' వెబ్ సిరీస్ లో సిరి ముఖ్యపాత్రని పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీహాన్ తో రిలేషన్ లో ఉన్న సిరి.. వెబ్ సిరీస్ లతో, షార్ట్ ఫిల్మ్ లతో బిజీగా ఉంటుంది.

తాజాగా సిరి కొన్ని ఫొటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందరిలాగే తను కూడా రూట్ మార్చాలని అనుకుంది కాబోలు.. కొన్ని హాట్ అండ్ బోల్డ్ ఫోటోలని షేర్ చేసింది. ఆ ఫోటోలని చూస్తే ఎవరైనా ఆ మాట అనాల్సిందే. సిరి షేర్ చేసిన ఈ ఫోటోస్ కి.. " స్టే ఇట్ " అనే క్యాప్షన్ రాసింది. అందాల ఆరబోతకు నేను సిద్ధం అనేట్టుగా ఉన్న ఈ ఫోటోలు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. అయితే తనని ఈ బోల్డ్ లుక్ లో చూసిన నెటిజన్లు.. " సినిమా అవకాశం కోసమేనా ఇదంతా " అంటూ అనగా, "సూపర్ అండ్ హాట్" అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.