English | Telugu

కూరగాయల చందు, గంగవ్వ లొల్లి.. అసలు విషయం ఏంటంటే!

గంగవ్వ.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. గంగవ్వ తెలుగు భాషను తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడి, మంచి వాక్చాతుర్యం కలిగిన కళాకారిణిగా గుర్తింపు పొందింది. గంగవ్వ తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 4 లో కంటెస్టెంట్ గా ప్రవేశించింది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ పాత్రికేయురాలుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

గంగవ్వ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని లంబాడిపల్లి గ్రామానికి చెందినది. గంగవ్వ 1వ తరగతి చదివి మధ్యలో పాఠశాల మానేయడంతో ఆమెకు అధికారికంగా పాఠశాల విద్య లభించలేదు. తన ఐదేళ్ళ వయస్సులో వివాహం చేసుకుంది. గంగవ్వకు నలుగురు పిల్లలు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గంగవ్వ మై వీలేజ్ షో లో నటించి గుర్తింపు పొంది ఏకంగా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో లోనే ఛాన్స్ కొట్టేసింది. మై వీలేజ్ షో లో గంగవ్వ చాలా వీడియోస్ చేసింది. తనకి ఏది అనిపిస్తే అదే చేస్తుంది. అదే మాట్లాడుతుంది. గంగవ్వ బిగ్ బాస్ లో కూడా అందరితో సరదాగా ఉండేది. కానీ అక్కడ వాతావరణం నచ్చక బిగ్ బాస్ లో కొన్ని రోజులు మాత్రమే ఉంది.

అయిన ఉన్నన్ని రోజులు తన స్పాంటేనియస్‌ పంచులతో నవ్వించేది. గంగవ్వ సొంత ఇంటి కలను నాగార్జున నిజం చేసాడు. బిగ్ బాస్ తర్వాత గంగవ్వ స్టార్ హీరో, హీరోయిన్ ని కలిసే అవకాశం కుడా దక్కింది. గంగవ్వని తన తోటి హౌస్ మేట్స్ ఇప్పటికి తరచు కలుస్తూనే ఉంటారు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు తనకు సపోర్ట్ గా అనిల్ జీల ఉన్నాడు. కాగా బయటకొచ్చాక కూడా ప్రతీ దాంట్లో గంగవ్వకి సపోర్ట్ గా ఉన్నాడు. గంగవ్వ లవ్ స్టోరీ మూవీలో నటించింది.

గంగవ్వ తాజాగా వచ్చిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ లో కోడలికి సపోర్ట్ చేసే అత్తగా నటించి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. కాగా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ లో ' కూరగాయల చందు- గంగవ్వ లొల్లి' అనే వీడియో అప్లోడ్ చేశారు. ఇందులో గంగవ్వ కొడుకు గా చందు, చేశాడు. అతను డ్యుయల్ రోల్ చేసి కామెడీ చేశాడు. అయితే ఈ వీడియోలో అన్న చందు కష్టపడుతూ కూరగాయలు పండించి, అమ్ముతుంటే.. తమ్ముడు ఆ కూరగాయలని కర్రీలుగా, చట్నీలుగా చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. తమ్ముడి స్మార్ట్ వర్క్ చూసిన అన్న చందు ఏం చేశాడు ? వాళ్ళిద్దరికి గొడవ జరిగిందా! అసలు గంగవ్వ లొల్లి ఏంది తెలియాలంటే ' మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ లోని ఈ వీడియోని చూడాల్సిందే. కాగా యూట్యూబ్ లో ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.



Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.