English | Telugu
మిషన్ ఎడ్యుకేషన్ భాద్యతలు రిషి తీసుకునేలా వసుధార చేయగలదా!
Updated : Jul 26, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -824 లో.. నేను చెప్పింది వింటే మీతో పాటు కార్ లో వస్తాను లేదంటే ఆటో లో వెళ్ళిపోతానని వసుధార అంటుంది. మిమ్మల్ని తీసుకొని వెళ్ళామని విశ్వనాథ్ సర్ చెప్పాడని వసుధారతో రిషి అంటాడు. "సరే ఏంటో చెప్పమని రిషి తన రిక్వెస్ట్ ని అంగీకరించినట్టు ఊహించుకుంటుంది" కానీ వసుధార మాట రిషి వినడు దాంతో తను నిరాశ చెందుతుంది.
ఆ తర్వాత రిషి కాలేజీకి వచ్చి వసుధార మాటలు గుర్తుచేసుకుంటాడు. చేసిందంతా చేసి ఇప్పుడు వినమంటే ఎలా వింటానని రిషి అనుకుంటాడు. అప్పుడే రిషికి దూరంగా ఉన్న వసుధార.. రిషికి వినపడేటట్లు పాండియన్, అతని ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. మన వ్యక్తిగత కారణాల వల్ల వృత్తిధర్మానికి అడ్డురాకూడదని పాండియన్, అతని ఫ్రెండ్స్ కి వసుధార గట్టిగా చెప్తుంది. అలా వసుధార చెప్పడంతో.. అది మాకు ఎందుకు చెప్తున్నారు మేడమ్ అని వసుధారతో పాండియన్ అంటాడు. అది విన్న రిషి..
ఆ విషయం మీకు కాదు నాకు అని తన మనసులో అనుకుంటాడు. చెప్పాల్సింది చెప్పేసాను ఇక సర్ మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకుంటాడని వసుధార అనుకుంటుంది. మరొకవైపు జగతి, మహేంద్రలు మీటింగ్ గురించి మాట్లాడుకుంటారు. మీటింగ్ లో మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు ఎవరికి ఇస్తున్నావని వాళ్ళ పేర్లు చెప్పమని అడిగితే ఏం చేస్తావని జగతిని మహేంద్ర అడుగుతాడు. వాళ్ళ పేర్లు చెప్పనని జగతి అంటుంది. మరొకవైపు శైలేంద్ర కాలేజీకి వస్తాడు. ఈ DBST కాలేజీ సామ్రాజ్యం నాది కావాలి. నన్ను మీటింగ్ కి పిలవకుండా ఏం చెయ్యాలనుకుంటున్నారని శైలేంద్ర అనుకుంటాడు. మరొకవైపు వసుధార ఎలాగైనా రిషి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తీసుకునేలా ఒప్పించడానికి ట్రై చేస్తుంటుంది. రిషి లైబ్రరీలో బుక్స్ చదువుతుంటే వసుధార వెళ్తుంది. వసుధారను చూసిన రిషి.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసని, ఇక్కడ నుండి వెళ్ళండని మెసెజ్ చేస్తాడు. నా ప్రయత్నం నేను చేసుకుంటున్నా అని వసుధార రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత వసుధారకి కబోడ్ తాకుతుంటే, రిషి తనకి తాకకుండా వసుధారని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏంజిల్ కాలేజీకి వస్తుంది. ఏంజెల్ వసుధార ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు.
మరొకవైపు కాలేజీలో బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు శైలేంద్రని పిలవకున్నా మీటింగ్ దగ్గరికి వస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు ఎవరికి ఇస్తున్నారు పేర్లు చెప్పండని శైలేంద్ర అడుగుతాడు. చెప్పను అయిన అది నీకు అనవసరం. పిలవకుండా వచ్చి ఈ డిస్టబెన్స్ ఏంటని శైలేంద్రపై జగతి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.