English | Telugu
కొత్త ఇల్లు కొనుక్కున్న జ్యోతక్క!
Updated : Sep 4, 2023
మొన్న ఆ మధ్య మణికొండలో ఇల్లు ఖాళీ చేసి వచ్చామంటూ శివజ్యోతి చేసిన వ్లాగ్ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తము కొత్త ఇల్లు కొనుక్కుంటున్నట్టుగా శివజ్యోతి అలియాస్ జ్యోతక్క తన యూట్యూబ్ లో చెప్పింది. తన భర్త గంగులుతో కలిసి కార్ లో వెళ్తూ వ్లాగ్ చేసింది జ్యోతక్క. తనేమో సిటీలోనే కమ్యూనిటి గెటెడ్ అపార్ట్మెంట్ లో ఇల్లు కొనుక్కుందామని అనగా, తన భర్త గంగులు మాత్రం సిటీకి దూరంగా ఇండిపెండెంట్ హౌజ్ కట్టుకుందామని చెప్పాడు. దాంతో 'ఛీఛీ తుతు అన్నీ గిట్లనే మాట్లాడతాడు. బుర్ర ఉండదు ఏం ఉండదు' అని జ్యోతక్క అంది. ఏం అయిందని గంగులు అడుగగా.. ఎక్కడో సిటీ అవతల ఇల్లు తీసుకొని, పిల్లల్ని మళ్ళీ సిటీలోకి తీసుకొచ్చి, మళ్ళీ తీసుకెళ్ళి రాను పోను ట్రావెలింగ్ కే టైమ్ సరిపోదని జ్యోతక్క అంది.
శివజ్యోతి బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న యాంకర్. తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరుతో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హౌజ్ లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ పర్సన్ గా శివజ్యోతిని చెప్తారు. బిగ్ బాస్ తర్వాత శివజ్యోతికి కెరీర్ మలుపు తిరిగింది. మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేనంత మంచి సక్సెస్ ఫుల్ లైఫ్ ని గడుపుతుంది శివజ్యోతి.
శివజ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు న్యూస్ ని అందిస్తుంది. శివజ్యోతి న్యూస్ చదవడంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. చమాత్కరంతో వార్తలు చదవడంలో శివజ్యోతి తర్వాతనే మరొకరు అని అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ వస్తుంది. శివజ్యోతి భర్త గంగూలీ కూడా అందరికి సుపరిచితమే. అప్పట్లో శివజ్యోతి గంగూలీ కలిసి ఇస్మార్ట్ జోడిలో పార్టిసిపేట్ చేసి అందరిని మెప్పించారు. శివ జ్యోతి తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. 'కొత్త ఇల్లు కొన్నుక్కున్నాం' అంటూ ఒక వ్లాగ్ చేసింది. ఎక్కడో ఉండేదాన్ని ఎక్కడ వరకు వచ్చాను అంతా మీ బ్లెస్సింగ్స్ అంటూ తను తీసుకున్న విల్లా కి సంబంధించిన పేపర్స్ ని తీసుకుని విల్లా కీస్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అయింది శివజ్యోతి. అయితే ఇంటి లోపల ఎలా ఉంటుందనేది తర్వాతి వీడియోలో చూపిస్తానంటూ ఫ్యాన్స్ కి క్యూరియాసిటిని పెంచేసింది జ్యోతక్క.