English | Telugu

ఘనంగా బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా పెళ్లి!

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల బిగ్ బాస్-5 కంటెస్టెంట్‌ మానస్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్-4 కంటెస్టెంట్‌ మహేష్ విట్టా ఓ ఇంటి వాడయ్యాడు.

తెలుగు వన్ కామెడీ సిరీస్ 'ఫన్ బకెట్' ద్వారా యూట్యూబ్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న మహేష్ కి ఆ తర్వాత పలు సినిమా అవకాశాలు వచ్చాయి. అలాగే బిగ్ బాస్-4 లో కంటెస్టెంట్‌ గా అవకాశం వచ్చింది. బిగ్ బాస్ లో తనదైన ఆట తీరుతో మహేష్ ప్రేక్షకులకు బాగానే చేరువయ్యాడు. అలాగే బిగ్ బాస్ ఓటీటీలో కూడా కంటెస్టెంట్‌ గా వెళ్లి ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ లో ఉన్న సమయంలోనే.. తన చెల్లెలి స్నేహితురాలిని ప్రేమిస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. తాజాగా మహేష్ వివాహం జరిగింది. సెప్టెంబర్ 3న బంధువులు, సన్నిహితుల సమక్షంలో మహేష్ పెళ్లి ఘనంగా జరిగింది. ప్రస్తుతం అతని పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.