English | Telugu
కళ్ళుతిరిగి పడిపోయిన సీతారామయ్య.. ఇచ్చిన మాటకి రాజ్ కట్టుబడి ఉంటాడా?
Updated : Sep 5, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -192 లో.. ఇన్ని రోజులు మీరు మారుతారని, నన్ను భార్య ఒప్పుకుంటారని చాలా ఎదరుచూశాను. ఇక అది జరగదని తెలిసింది, నేను ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలని రాజ్ తో కావ్య అనగానే... ఈ ఇంట్లో నీకేం తక్కువయిందని రాజ్ అంటాడు. ప్రేమ తక్కువ అయింది. స్థానం తక్కువ అయిందని కావ్య ఎమోషనల్ అవుతుంది.
ఇక నేను ఈ ఇంట్లో ఉండను.. మీరు నా ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడితే.. ఆత్మ గౌరవం చంపుకొని ఇక్కడ నేను ఉండలేను వెళ్ళిపోతానని కావ్య చెప్తుంది. అది నీ ఇష్టమని రాజ్ అంటాడు. మరొక వైపు రాజ్ , కావ్య మాటలు విన్న సీతారామయ్య వాళ్ళ గురించి ఆలోచిస్తూ.. కళ్ళు తిరిగి కిందపడిపోతాడు.. అందరూ ఒక్కసారిగా సీతారామయ్య దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతారు. ఆ తర్వాత రాజ్ సుభాష్ లు సీతరామయ్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. సీతరామయ్యని చూసిన డాక్టర్.. రాజ్ , సుభాష్ లతో మాట్లాడతాడు.
ఆయనకి బ్లడ్ కాన్సర్ ఉందని డాక్టర్ చెప్తాడు. అది విని ఇద్దరు షాక్ అవుతారు. సీతారామయ్య గారు మూడు నెలల కంటే ఎక్కువ బ్రతకరని, తనని హ్యాపీగా చూసుకోండి.. బాధపెట్టే విషయాలేం చెప్పకండి. ఎంత సంతోషంగా ఉంటే అని ఎక్కువ రోజులు బ్రతుకుతాడని డాక్టర్ చెప్తాడు.. ఆ తర్వాత సీతరామయ్యని హాస్పిటల్ నుండి తీసుకొని ఇంటికి వెళ్తారు. అందరు డాక్టర్ ఏం అన్నాడని అడుగుతారు. బాగున్నాడు, ఏం ప్రాబ్లమ్ లేదుని చెప్పగానే అందరూ రిలాక్స్ అవుతారు. సీతారామయ్యను రాజ్ గదిలోకి తీసుకొని వెళ్తాడు. సుభాష్ డల్ గా ఉండడంతో ఏమైంది అలా ఉన్నారని అపర్ణ అడుగుతుంది. ఏం లేదు తలనొప్పి.. కాఫీ తీసుకొని రా అని సుభాష్ చెప్పి వెళ్ళిపోతాడు.
మరొకవైపు నువ్వు ఇంకా వెళ్లిపోలేదా అని కావ్యతో రాజ్ అడుగుతాడు. ఇంట్లో ఇలా ఉంటే ఎలా వెళ్ళాలని కావ్య అనగానే.. ఇదొక సాకు అని రాజ్ అంటాడు. మీరు ఇప్పుడు కూడా వెళ్ళలేదా అని అడిగారు. నా మనసు ఇంకా ఎందుకు ఉన్నావని అడుగుతుంది. వెళ్ళిపోతానని కావ్య చెప్తుంది.. ఆ తర్వాత రాజ్ ని సీతారమయ్య పిలుస్తున్నాడని తెలిసి వెళ్లి మాట్లాడుతాడు. నువ్వు కావ్య సంతోషంగా ఉండాలి. కావ్యని హ్యాపీగా చూసుకుంటానని మాట ఇవ్వు అని సీతరామయ్య అంటాడు. తాతయ్య సంతోషం కోసం మాట ఇస్తున్న ప్రేమగా ఉన్నట్లు నటిస్తానని రాజ్ మనసులో అనుకొని సీతారామయ్యకి రాజ్ మాట ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.