English | Telugu
నటరాజ్ మాష్టర్ ని అవమానించిన సుమ...భార్యను ఈడ్చుకుంటూ వెళ్లిపోయిన మాష్టర్
Updated : Sep 5, 2023
సుమ అడ్డా షో కొన్ని వారాలుగా ప్రశాంతంగా అలా కూల్ గా నడిచిపోతోంది. ఎలాంటి కాంట్రోవర్సి అనేది లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ వారం షో కాంట్రోవర్సి అయ్యేట్టుగానే ఉంది. సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆట సందీప్, జ్యోతిరాజ్, నటరాజ్, నీతూ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీళ్ళతో గేమ్స్ కూడా ఆడించింది. డాన్సులు చేయించింది. ఇక ఫైనల్ గా ఒక సెగ్మెంట్ పెట్టింది సుమ. అదే "వెల్కమ్ టు సుమతో డాన్స్ టునైట్ " అని అనౌన్స్ చేసేసరికి సందీప్, నటరాజ్ మాస్టర్స్ ఇద్దరూ కలిసి పోటాపోటీగా డాన్స్ ఇరగదీసేసారు.
ఆ తర్వాత స్టేజి మీదకు ఒక స్టూడెంట్ ని పిలిచింది సుమ. వీళ్ళ డాన్స్ కి అందరూ ఊగిపోయారు. ఫ్లోర్ మూమెంట్స్, మోకాళ్ళ మూమెంట్స్ ఇరగదీసేసారు. సుమ గట్టిగా అరుస్తూ ఎంజాయ్ చేసింది. ఇలా ఇద్దరికీ పోటీ పెట్టిన తర్వాత విన్నర్ ని డిక్లేర్ చేసే టైం వచ్చింది అంటూ ఇద్దరి చేతులు పట్టుకుంది.. ఫైనల్ గా ది బెస్ట్ డాన్సర్ ఈజ్ అంటూ ఒక కప్పును ఆ స్టూడెంట్ చేతిలో పెట్టింది. దాంతో నటరాజ్ మాష్టర్ కి కోపం వచ్చేసింది. "నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అనిపించింది నాకు. నేను కొన్ని విషయాల వరకే కామెడీగా తీసుకుంటాను అన్ని తీసుకోను నా వల్ల కాదు" అని సీరియస్ స్టేజి మీద నుంచి తన వైఫ్ నీతూని కూడా ఈడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి సుమ షాకై "హలో హలో" అని పిలిచింది..ఇదంతా చూసాక ఆట సందీప్ కూడా స్టేజి మీద నుంచి పక్కకు వచ్చేసాడు. నటరాజ్ మాష్టర్ కోపం కొంచెం ఎక్కువే..ఆయన కోపాన్ని నీతోనే డాన్స్ షోలో ఆల్రెడీ చూసాం. నీతూ ఎప్పుడు సర్ది చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంత అవమానం చేసింది సుమ. మరి నిజంగానే నటరాజ్ మాస్టర్ కి కోపం వచ్చి వెళ్ళిపోయాడు. లేదంటే ఇదంతా పైకి షో మాత్రమేనా తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాలి.