English | Telugu
బిగ్ బాస్ కి వెళ్లకపోవడమే మంచిది..కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్
Updated : Sep 5, 2023
మూవీస్ ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కాంట్రావర్సీల ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది కరాటే కళ్యాణి. ఐతే ఈమె బిగ్ బాస్ సీజన్ 7 గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షోను ఆపాలని చాలామంది కోరుతూ కోర్టులో పిటిషన్లు వేస్తారు. వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. "బిగ్ బాస్ వల్ల మంచి ఉంది, చెడు కూడా ఉంది. బిగ్ బాస్ సీజన్ కి వెళ్లొచ్చాక అందరూ ఖాళీ ఐపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆరు నెలలు ఆపేస్తారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆ క్రేజ్ తో బిగ్ బాస్ అనుకుంటారు కానీ ఆ ఆరు నెలల తర్వాత వాళ్ళు వీళ్ళను మర్చిపోతారు.
తర్వాత వీళ్లకు ఉన్నవి పోతాయి రావాల్సిన ఆఫర్స్ కూడా పోతాయి. బిగ్ బాస్ కి వెళ్లకపోవడమే మంచిది. బిగ్ బాస్ కి మేము వెళ్ళొచ్చాము కాబట్టి మాకు తెలుసు అందులో ఏమీ ఉండదు. బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ షో దాన్ని అలాగే చూడాలి. ఈ ప్లాట్ఫారం ద్వారా ఎవరైనా టాలెంటె ఉన్న వాళ్ళు బయటికి వస్తే మంచిదే కదా. నా క్రేజ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. బిగ్ బాస్ రాక ముందు నుంచి నా క్రేజ్ నాకు ఉంది. మళ్ళీ అవకాశం వస్తే బిగ్ బాస్ షోకి వెళ్తాను. బిగ్ బాస్ షో సీజన్ 4 సక్సెస్ సాధించింది. అందులో నాకు నేను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాను. రెండు వారాలు ఉంది తర్వాత బయటకు వచ్చాను" అని చెప్పింది కరాటే కళ్యాణి . పనిలో పనిగా మహిళా సంఘాలని, అప్పుడప్పుడు వచ్చి కామెంట్స్ చేసి నారాయణను కూడా కలిపి కామెంట్స్ చేసింది కళ్యాణి. కరాటే కళ్యాణి మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.