English | Telugu

 రిషి దాచిన ఆ డ్రాయింగ్ ఎవరిదో ఏంజిల్ తెలుసుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -859 లో.. వసుధార దగ్గరికి ఏంజిల్ వస్తుంది. రిషి సర్ కి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు. తను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు. ఎన్ని సార్లు అడిగిన రిషి సర్ అదే మాట చెప్తున్నాడని ఏంజిల్ కి వసుధార చెప్తుంది. అలా చెప్తున్నాడు సరే కానీ కారణం ఏంటని చెప్పట్లేదు కదా అని ఏంజిల్ అనగానే.. కారణం నేనే అని నీకెలా చెప్పాలని వసుధార తన మనసులో అనుకుంటుంది.

ఆ తర్వాత రిషి సర్ నీకు సెట్ అవ్వడని వసుధార అనగానే.. మరి నీకు సెట్ అవుతాడా అని ఏంజిల్ అడుగుతుంది. ఆశ్చర్యంగా అలా అంటున్నవ్ ఏంటని వసుధార అంటుంది. మరేంటి రిషికి నేనే సెట్ అవుతానని ఏంజిల్ చెప్తుంది. సరే ఒక చార్ట్ పై రిషి సర్ ప్లస్ ఇంకా మైనస్ లు రాద్దామని వసుధార రాస్తుంది. వసుధార అలా రిషి గురించి రాసేసరికి ఏంటి రిషి గురించి తెలిసినట్టు రాస్తున్నవని ఏంజిల్ కి డౌట్ వచ్చి అడుగుతుంది. ఇన్ని రోజుల నుండి చూస్తున్న ఆ మాత్రం తెలియదా అని వసుధార కవర్ చేస్తుంది. రిషి గురించి వసుధార రాసిన చార్ట్ తీసుకొని ఏంజిల్ వెళ్తుంది. మరొక వైపు రిషి డ్రా చేసిన వసుధార కళ్ళనే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఏంజిల్ వచ్చి.. రిషి అని అనగానే వెంటనే రిషి ఆ డ్రాయింగ్ ని పిల్లో కింద దాచేస్తాడు. రిషి ఏదో దాచేస్తున్నాడని ఏంజిల్ కి డౌట్ వస్తుంది కానీ రిషిని ఆ విషయం అడగదు. రిషి నువ్వు ఈ రోజు ఎక్కడికి వెళ్ళకూడదని ఏంజిల్ అనగానే.. ఎందుకని రిషి అంటాడు. నేనొక సర్ ప్రైజ్ ప్లాన్ చేశాను. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తుందని ఏంజిల్ చెప్తుంది. నాకు అలాటివేం ఇంట్రెస్ట్ ఉండవ్.. నాకు వర్క్ ఉందని రిషి వెళ్ళబోతుంటే నన్ను బాధపెట్టడం ఇష్టం ఉంటే వెళ్ళు అనగానే రిషి ఆగుతాడు. ఆ తర్వాత హాల్లో కూర్చొని ఏంజిల్ చెప్పిన గెస్ట్ కోసం ఏంజెల్, రిషి ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏంజెల్ చెప్పిన గెస్ట్ ఎవరో కాదు వసుధారనే.. వసుధారని చూసిన రిషి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వసుధార రాసి ఇచ్చిన చార్ట్ ని రిషికి ఇచ్చి చదవమంటుంది ఏంజిల్. అవి రిషి చదువుతూ వసుధార వైపు కోపంగా చూస్తాడు. ఆ తర్వాత కాఫీ తెస్తానంటూ ఏంజిల్ వెళ్ళగానే.. మళ్ళీ వసుధార, రిషిల మధ్య టామ్ అండ్ జెర్రీలా గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వసుధార ఇంటికి వెళ్ళిపోతుంది.

మరొక వైపు రిషి గదిలోకి ఏంజిల్ వెళ్లి.. పిల్లో కింద ఏం దాచాడో చూస్తుంది. కళ్లు ఉన్న డ్రాయింగ్ చూసి.. ఎవరివి ఈ కళ్లు అనుకొని తన ఫోన్ లో ఫోట్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి ఎదరుపడతాడు. రిషికి ఏంజిల్ పట్ల ఎలాంటి అభిప్రాయం లేదని ఇలాంటి ప్రయత్నాలు చెయ్యవద్దని క్లియర్ గా ఏంజిల్ కి రిషి చెప్తాడు. ఏంజిల్ ఆ కళ్ళు ఉన్న డ్రాయింగ్ గురించి అడుగుదామని అనుకుంటుంది. కానీ రిషి ఏం చెప్పడని అడుగదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.