English | Telugu
పవర్ అస్త్ర చేతిలో బిగ్ బాస్ సీజన్ 7 పవర్
Updated : Sep 5, 2023
కొన్ని నెలల నుంచి ఊరిస్తూ వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ఐపోయింది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ ఒక రేంజ్ లో వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని పలకరించారు. "టార్ మార్ టక్కర్ మార్" సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగ్ మీరెంతైనా ఊహించుకోండి మీ ఊహకు అందని సీజన్ 7 ఉల్టా ఫుల్టా అని చెప్పారు. ఇప్పటివరకు మీరు చూసిన ఆట వేరు ఇప్పుడు మీరు చూడబోయే ఆట వేరు అంటూ ఒక రేంజ్ షో గురించి ఇంట్రో చెప్పారు. ఐతే హౌస్ లోకి వచ్చిన ఏ కంటెస్టెంట్ కూడా కంఫర్మ్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ హౌస్ లో స్పెషల్ గా "పవర్ అస్త్ర" పేరుతో ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు..
ఈ పవర్ అస్త్ర లోగో కూడా ఒంటి కన్నుతో బ్లూ కలర్ లో మంచి కలర్ ఫుల్ గా ఉంది. ఈ అస్త్ర మాత్రమే కంటెస్టెంట్స్ ని డిసైడ్ చేస్తుందని చెప్పారు నాగ్. ఈ పవర్ అస్త్రాని దక్కించుకున్న వాళ్ళే హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతారని అప్పటి వరకు హౌస్ మేట్స్ మాత్రమే అని ట్విస్ట్ పెట్టారు. ఈ పవర్ అస్త్ర ఇచ్చే పవర్ ఏ సీజన్ లో కూడా చూసి ఉండరు అన్నారు. ఈ హౌస్ లో ఈ పవర్ అస్త్రానే బ్రహ్మాస్త్ర అని కూడా చెప్పారు. గెలుపు కోసం పరిగెత్తేవారికి ఈ పవర్ అస్త్ర ఒక గుర్రం లాంటిది అన్నారు నాగ్. మరి ఈ సీజన్ మొత్తం పవర్ అస్త్ర నడిపిస్తుందన్నమాట. మొదటి రోజు హౌస్ మేట్స్ అంతా ఖుషీఖుషీగా సందడి చేశారు. హీరో విజయ్ దేవరకొండ కాంపిటీషన్ పెట్టి వాళ్ళ లివింగ్ రూమ్ లోకి కావాల్సిన సామానులు హౌస్ మేట్స్ తో సంపాదించుకునేలా చేసి హౌస్ లోంచి బయటకు వచ్చాడు. చివరిగా నవీన్ పోలిశెట్టి వెళ్లేసరికి ఆడవాళ్ళంతా కలిసి ఆయన మీద పడిపోయారు. మరి చూడాలి ఇక హౌస్ లో గొడవలు, కొట్లాటలు, హడావిడి ఎలా ఉంటుంది...