English | Telugu

బిగ్ బాస్ లో హీటెక్కిన నామినేషన్లు.. నామినేషన్ లో ఉంది వీళ్ళే!

బిగ్ బాస్ 7 షురూ అయింది. నామినేషన్ , ఎలిమినేషన్ అంటూ హౌజ్ లో హీటెక్కే వాదనలు‌ మొదలయ్యాయి. ఏ మూవీకీ రాని హైప్ బిగ్ బాస్ నామినేషన్ ప్రోమోకి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. బిగ్ బాస్ హౌజ్ లో నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా కోనసాగుతుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికేది నామినేషన్ ప్రక్రియ లోనే. ఒకరినొకరు తిట్టుకోవడాలు శృతిమించితే కొట్టాడాలు అన్నిరకాల ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ప్రతి సోమవారం నామినేషన్ ప్రక్రియ ఉంటుంది.

ఈ సీజన్ లో ఎన్నడూ లేని విధంగా నామినేషన్ ప్రక్రియ ఉంది. వచ్చి ఒక్కరోజే అయినా ఒక కంటెస్టెంట్ మరొక కంటెస్టెంట్ గురించి ఎలా డిసైడ్ చేస్తారనే కన్ఫ్యూషన్ తో ఆట మొదలైంది. మొదట కంటెస్టెంట్ ని స్టోర్ రూమ్ కి ఇద్దరిని నామినేట్ చేయమని చెప్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఆ నామినేట్ చేసిన ఇద్దరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి, వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తున్నారో తెలుసుకునేలా ఏర్పాట్లు చేశాడు బిగ్ బాస్. దీంతో నామినేట్ చేయబడ్డ వారు, ఎవరైతే నామినేట్ చేశారో వారితో డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అసలు ఫైట్ మొదలైంది. మొదటగా శివాజీని పిలిచి ఏ ఇద్దరు ఈ ఇంట్లో ఉండటానికో అనర్హులని మీరు అనుకుంటున్నారో వారిని నామినేట్ చేయండని బిగ్ బాస్ కోరగా.. మొదట గౌతమ్ కృష్ణని, రెండవ కంటెస్టెంట్ గా సింగర్ దామిణిని నామినేట్ చేశాడు శివాజీ. తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ అనగా.. హౌజ్ లో ఉన్నవాళ్ళకి అందరికీ ఈ బిగ్ బాస్ కీలకం, గౌతమ్ కృష్ణ యంగ్ ఏజ్ లో ఉన్నాడు. బయటకెళ్తే హీ ఈజ్ సర్వైవ్, చాలా అవకాశాలు వస్తాయి. ఇక్కడ అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేడని అనిపించిందని గౌతమ్ కృష్ణ గురించి శివాజీ అన్నాడు. ఆ తర్వాత తను మంచి మంచి పాటలు పాడింది. బయటకు వెళ్తే చాలా ఛాన్స్ లు వస్తాయి. తనని ఆడియన్స్ సేవ్ చేస్తారు. ఇక్కడ అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వదని అనిపిస్తుంది. అందుకే దామిణిని నామినేట్ చేశానని శివాజీ చెప్పాడు.

ఆ తర్వాత నామినేట్ చేయడానికి స్టోర్ రూమ్ కి ప్రియాంక జైన్ వెళ్ళి.. మొదటి నామినేషన్ పల్లవి ప్రశాంత్, రెండవ నామినేషన్ రతిక అని చెప్పింది. కారణాలు చెప్పమని బిగ్ బాస్ అనగా.. నేను అందరితో క్లోజ్ అవ్వడానికి ట్రై చేశాను. కానీ వీళ్ళిద్దరు అంత క్లోజ్ అవ్వలేదు. మాతో కలవడానికి కూడా ఇష్టపడలేదు. నైట్ ఒక గుడ్ లక్ అని ఇచ్చారు కదా, అప్పటినుండి రైతు బిడ్డలమని అనుకున్నారు. నేనేమో అందరితో కలిసిపోవాలని అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరు కలవలేదని ప్రియాంక జైన్ అంది. అదంతా పల్లవి ప్రశాంత్, రతిక కన్ఫెషన్ రూమ్ లో చూశారు. " నైట్ పడుకోలేదు.. నైట్ వరకు యాక్టివ్ గా ఉన్నారు. మార్నింగ్ నుండి లేరని మరొక కారణం చెప్పింది ప్రియాంక. నామినేషన్ ప్రక్రియ ముగిసాక .. పల్లవి ప్రశాంత్, రతిక మరియు ప్రియాంక జైన్ మధ్య డిస్కషన్ జరిగింది. "మీకు అనిపించింది మీరు చేస్తారు కదా, నాకనపించింది నేను చేస్తాను" అని ప్రియాంక అనగా.. నేనెంత యాక్టివ్ గా ఉన్నానో, నాకు తెలుసు కెమెరాస్ కి తెలుసు. నిజంగా ఇది ఇన్ వాలిడ్ అని రతిక అంది. కాసేపటికి రతిక, పల్లవి ప్రశాంత్ ఇద్దరు మాట్లాడుకున్నారు. "నీతోనైతే మంచిగనే ఉన్నానా? ఏడ తప్పు కనిపించలేదు కదా" అని పల్లవి ప్రశాంత్ అనగా.. మనం ఆక్సెప్ట్ చేయాలే అని రతిక అంది. ఇలా మొదటి రోజు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇలాంటి హీటెక్కే నామినేషన్లు ఇంకా అవుతూనే ఉంటాయి. చూడాలి మరి ఎలా ఉంటుందో.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.