English | Telugu

పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ గా మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ సీజన్-7 లో ప్రస్తుతం మూడవ వారం కొనసాగుతుంది.  రెండవ వారంలో బీటెక్-రైతు అంటు‌ పల్లవి ప్రశాంత్ పై అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు కాంట్రావర్సికి కేరాఫ్ గా మారిన విషయం తెలిసిందే. దానికి కారణం లేకపోలేదు. పల్లవి ప్రశాంత్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించాడు అమర్ దీప్. అతనితో పాటు హౌజ్ లోని మిగత  కంటెస్టెంట్స్ అందరు అతన్ని టార్గెట్ చేసి నామినేట్ చేశారని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తెలిసింది‌. అయితే ఆ వారం నామినేషన్ లో అందరు వరుసగా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి, వారికి తెలియకుండానే  అతడిని మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని చేసేసారు.