English | Telugu

నటి జయలలిత అలా కావడానికి కారణం ఏంటో తెలుసా?



సీనియర్ యాక్ట్రెస్ జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే క్లాసికల్ డాన్సర్‌ను అయిన ఆమె తనకు ఇష్టం లేకపోయినా కేవలం తన తండి వల్లే సినిమా ఇండస్ట్రీలోకి వాంప్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో తన గురించి ఇలా చెప్పారు. "నేను పుట్టింది గుడివాడ బేతవోలు. పెరిగింది గుంటూరులో. నాన్న గారికి సినిమాలతో సంబంధాలున్నాయి.

నేను మా అక్క చల్లా సిస్టర్స్..మేము డాన్సర్స్ కూడా ... అక్కతో పాటు చింతా రాధాకృష్ణ మూర్తి గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నాను. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఫీల్డ్ కి రావాల్సి వచ్చింది.. 1983లో డిగ్రీ పూర్తిచేసి 1984 లో హైదరాబాద్ వచ్చాను. నటరాజ్ రామకృష్ణ గారి దగ్గర ఆంధ్ర నాట్యం నేర్చుకుందామని వచ్చాను. ఐతే నాన్న ఒకరోజు అకస్మాత్తుగా గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. నా ఫ్రెండ్స్ మూవీ తీస్తున్నారు.. హీరోయిన్‌గా క్లాసికల్ డాన్సర్ కావాలట.. నువ్వు చేయాలి అని నన్ను అడిగారు. నాకు మూవీస్ అంటే ఇష్టం లేక ఏడుస్తూ కూర్చున్నాను అప్పుడు నటరాజ్ రామకృష్ణ గారు, కళాకృష్ణ గారు సర్ది చెప్పారు.

చివరికి నన్ను ఒప్పించారు. ఆ మూవీ టాకీ పార్టీ మొత్తం రేపల్లెలో అయ్యాక సాంగ్స్ కోసం చెన్నై విజయ గార్డెన్స్ కి వెళ్లాం . అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు నిర్మాత ధనుంజయ రెడ్డి నన్ను చూశారు. అమ్మాయి బాగుంది ‘ఖైదీ’ మూవీలో డాక్టర్ క్యారెక్టర్ ఉందని నాన్నను అడిగారు. వెనకా ముందూ ఆలోచించకుండా ఫ్యామిలీ మొత్తాన్ని చెన్నై షిఫ్ట్ చేసేశారు నాన్న. ఆ టైంలోనే మలయాళం మ్యాగజైన్ ‘నానా’కు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూని చూసిన డైరెక్టర్ పవిత్రన్ ఉప్పు అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఐవీ శశి చూసారు. కమల్ హాసన్‌, గీత, శోభనతో కలిసి తాను తీసే మూవీలో చేయమని అడిగారు. అందులో నేను వ్యాంప్ క్యారెక్టర్ చేసాను. ఫ్యామిలీ మొత్తం చెన్నై వచ్చేసి నా మీదే ఆధారపడ్డారు.. ఇక వ్యాంప్ క్యారెక్టర్లు చేయక తప్పలేదు. సొంతూరుకి తిరిగి వెళ్లలేక, కుటుంబం కోసం వ్యాంప్ క్యారెక్టర్లు ఒప్పుకోవాల్సి వచ్చింది..అలా నా జర్నీ కంటిన్యూ అయ్యింది" అన్నారు జయలలిత.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.