English | Telugu

వెడ్డింగ్ కార్డ్ తో కళ్యాణ్ కి లవ్ ప్రపోజల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -206 లో.. కావ్య తన పుట్టింటికి వెళ్ళడానికి అపర్ణ అనుమతి తీసుకోగ అపర్ణ వెళ్ళమని చెప్తుంది. ఈ రోజుతో కాంట్రాక్టు పూర్తవుతుంది. మా పుట్టింటి వాళ్ళ అప్పు తీరిపోయి వాళ్ళకి ఇల్లు సొంతం అవుతుందని సీతారామయ్య, ఇందిరాదేవిల దగ్గర కావ్య ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతుంది.

మరొక వైపు అనామికని కలవడానికి కళ్యాణ్ వెళ్తాడు. అప్పు ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యకుండా అనామికని కలిసి గుడ్ న్యూస్ తో అప్పుని కలుస్తానని కళ్యాణ్ అనుకుంటాడు. కాఫీ షాప్ లో అనామికని కలుస్తాడు. అనామిక ఒక వెడ్డింగ్ కార్డు ఇచ్చి.. ఇది నా వెడ్డింగ్ కార్డు చదువు అని అనగానే కళ్యాణ్ డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత కార్డు లో కళ్యాణ్ పేరు ఉండడం, అబ్బాయి అతనే అని సంబరపడిపోయి అనామికని హగ్ చేసుకుంటాడు. మీ కవితలే కాదు మీరు కూడా ఇష్టమని కల్యాణ్ తో అనామిక చెప్తుంది. ఒక వైపు కృష్ణమూర్తి దగ్గరికి‌ కావ్య వెళ్తుంది. మిగిలిన బొమ్మలకు కలర్ లు వేస్తుంది. మరొకవైపు రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేసి.. ఈ రోజుతో కావ్య చేసే కాంట్రాక్ట్ పూర్తి అవుతుందంట. నువ్వేం చేస్తావో నాకు తెలియదు కావ్య పుట్టింటి వాళ్ళకి ఇల్లు సొంతం కాకూడదని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. నేను చూసుకుంటానని రాహుల్ అంటాడు.

మరొక వైపు సీతరామయ్యకి రాజ్ ఫోన్ చేసి.. టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు. నేను వేసుకున్న కానీ నీ భార్య పుట్టింటికి వెళ్ళింది. వస్తుందా లేదా అని ఫోన్ చెయ్యాల్సిన అవసరం లేదా అని సీతారామయ్య అడుగుతాడు. సరే చేస్తానని రాజ్ అనగానే.. అవసరం లేదు కావ్య రావడం లేట్ అవుతుంది అంట అని సీతరామయ్య చెప్తాడు. సరే నేను వెళ్లి తీసుకొని వస్తానని రాజ్ అనగానే.. సీతరామయ్య హ్యాపీగా ఫీల్ అయి సరే అంటాడు. ఆ తర్వాత కావ్యని తీసుకొని రావడానికి రాజ్ తన అత్తగారింటికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.