English | Telugu

మళ్ళీ చెప్తున్నా...ఆ వీడియోస్ పెట్టి నా హార్ట్ బ్రేక్ చేయొద్దు

దేశవ్యాప్తంగా గణేష్‌ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్న తరుణంలో ప్రముఖ యాంకర్‌ రష్మీ వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేసి తీవ్రంగా విమర్శించింది. ఐతే ఇందులో కొంతమంది భక్తులు ఏనుగును టార్చర్‌ చేస్తూ విన్యాసాలు చేయించారు.

అసలే యానిమల్‌ లవర్‌ అయిన యాంకర్‌ రష్మీకి కోపం పీక్స్ కి వెళ్ళిపోయింది. ఈ వీడియోపై స్పందిస్తూ మూగజీవాలను ఇలా ఇబ్బంది పెట్టవద్దంటూ కోరింది. ‘ఇది చాలా బాధాకరం. ఊరేగింపుల్లో జంతువులను అసలు తీసుకురాకూడదు. ఏనుగు చెవులను బుల్‌ హక్‌తో పొడిచి టార్చర్‌ చేస్తూ.. ఇలా విన్యాసాలు చేయిస్తున్నారు. హిందువులు, సనాతన ధర్మాన్ని అనుసరించే వారు పండగలు, పర్వదినాల్లో ఇలా మూగజీవాలకు హాని జరగకుండా చూసుకోవాలి ఇది పాత వీడియోనే ఐనా సరే మీ అందరికీ మళ్ళీ చెబుతున్నా.

ఈ పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నాను’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది రష్మీకి అనుకూలంగా కామెంట్లు చేస్తుంటే కొంతమంది ఎప్పటిలాగే నెగెటివ్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ ఏ మూగజీవికి సమస్య వచ్చినా తన ప్రేమను చాటుకుంటుంది రష్మీ. కరోనా సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టింది. యానిమల్ లవర్ గా రష్మీ షేర్‌ చేసే పోస్టులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మిస్‌ ఫైర్‌ అవుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పిల్లలపై కుక్కల దాడి విషయంలో విమర్శలు ఎదుర్కొంది రష్మీ. అలాగే బక్రీద్‌ సందర్భంలో ఆమె చేసిన ట్వీట్‌పై కూడా ట్విట్టర్ లో మాటల యుద్ధమే ఎదుర్కొంది. ఇక కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై కూడా కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచింది. స్టార్‌ యాంకర్‌గా బుల్లితెరపై హవా సాగిస్తోన్న రష్మీ అప్పుడప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా మెరుస్తోంది. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ లో మెరిసిందీ రష్మీ.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.