English | Telugu
మురారిని ఆటపట్టించిన కృష్ణ.. అది చూసి ముకుందకి కాలిందా!
Updated : Sep 20, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -267 లో.. ముకుంద, మురారి ఇద్దరు మాట్లాడుకుంటారు. నిన్ను తప్ప ఎవరిని ప్రేమించనంటూ తనలోని ఎమోషన్ నీ బయటపెడుతుంది ముకుంద. కానీ మురారి మాత్రం దానికి అంగీకరించకుండా.. నువ్వు నా స్నేహితుడి భార్యవి మాత్రమే ఒకప్పుడు ప్రేమించిన మాట నిజమే కానీ ఎప్పుడు అయితే ఆదర్శ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడో అప్పుడే నా ప్రేమని మర్చిపోయానని మురారి అంటాడు.
ఆ తర్వాత ప్లీజ్ ముకుంద ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను నిన్ను ఆ దృష్టితో నేను చూడలేనని, తనపై ఏ ఫీలింగ్ లేదని క్లారిటీగా చెప్పేస్తాడు మురారి. ముకుంద మాత్రం తన ధోరణి మాత్రం మార్చుకోదు. అయితే మురారి, ముకుంద మాట్లాడుకునే మాటలన్ని కృష్ణ వింటుంది. నేను ఇన్ని రోజులు ఏసీపీ సర్ ని అపార్థం చేసుకున్నానా? ఈ ముకుందకి నేనే సమాధానం చెప్పాలని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు నిద్రపోతున్న మురారి దగ్గరికి కృష్ణ వెళ్లి.. ముకుంద ప్రేమ గతం, ఇప్పుడు నువ్వు తప్ప నా మనసులో ఎవరు లేరని ఒక చిన్న మాట చెప్తే అయిపోయే దానికి ఇంత చెయ్యేలా అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మురారి ని ఆటపట్టించాలనుకొని పెన్ తో మురారి మొహంపై చిన్న పిల్లాడిలా బొట్టు పెడుతుంది. ఆ తర్వాత అందరికి కాఫీ ఇస్తుంది.
ఆ తర్వాత ముకుంద భవానికి కాఫీ తీసుకొచ్చేలోపే కృష్ణ ఇస్తుంది. ముకుంద కంటే ముందే లేచి వర్క్ చేశాను. నేను టైమ్ నీ ఫాలో అవుతానంటూ ముకుందకి కౌంటర్ వేస్తుంది కృష్ణ. ఆ తర్వాత పై నుండి వస్తున్న మురారిని చూసి అందరు నవ్వుతుంటారు. అదేంటి అందరు నన్ను చూసి నవ్వుతున్నారని అద్దంలో చూసుకుంటాడు. తన మొహం పై ఉన్న ఆ బొట్టుని చూసి ఇదంతా కృష్ణ పనే అని తనని పట్టుకొవాలని ప్రయత్నిస్తాడు కానీ కృష్ణ అటు ఇటు తిరుగుతుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి అలా సరదాగా ఉండడం చూసిన రేవతి.. ముకుందని చూసి కనుబొమ్మలు ఎగురవేస్తుంది. దాంతో ముకుందకి కోపం వచ్చి కాఫీ కప్పుని కింద పడేస్తుంది.
ఆ తర్వాత ఏమైందని భవాని అడిగితే.. కాలినట్టుందని రేవతి అంటుంది. అదే కాఫీ కాలినట్టుందని రేవతి కవర్ చేస్తుంది. ఆ తర్వాత మధు, రేవతి ఇద్దరు కృష్ణ, మురారి ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నారని అనుకుంటారు. కానీ ముకుంద గురించే భయంగా ఉంది. మళ్ళీ ఏం చేస్తుందోనని రేవతి అంటుంది. మరొక వైపు అందరు నన్ను చూసి నవ్వారు. నీ సంగతి చెప్తానంటు కృష్ణని పట్టుకుంటాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.