English | Telugu
ఏంజిల్ మాట వినకుండా వెళ్ళిన రిషి.. ఫణీంద్ర వేసిన శిక్ష అదేనా!
Updated : Sep 21, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -873 లో.. ఫణింద్ర దగ్గరికి జగతి మహేంద్ర ఇద్దరు వస్తారు. అన్నయ్య భోజనానికి రావడం లేదని అనగానే.. నేను రాను ఇక్కడే తింటానని ఫణింద్ర కోపంగా అంటాడు. మేం ఏం తప్పు చేశామని అంత కోపంగా ఉన్నారని ఫణీంద్రని మహేంద్ర అడుగుతాడు. నాకు రిషి గురించి చెప్పకుండా ఎందుకు దాచారు. అంత పరాయివాన్నయ్యానా? ఇది కోపం కాదు బాధ మాత్రమేనని ఫణింద్ర అంటాడు. జగతి మహేంద్రలను అక్కడ నుండి వెళ్ళమని చెప్తాడు ఫణింద్ర.
ఆ తర్వాత జగతి, మహేంద్ర ఇద్దరు ఫణింద్ర దగ్గర నుండి రావడం చుసిన దేవయాని.. మా ప్లాన్ సక్సెస్ అయింది అన్నటుగా.. ఇక ఇప్పుడే మెల్లి మెల్లిగా DBST కాలేజీని మా సొంతం చేసుకుంటానని అంటుంది. మరొక వైపు వసుధార దగ్గరికి ఏంజిల్ వస్తుంది. రిషి ఇంకా ఇంటికి రాలేదు. నీకు ఏమైనా తెలుసేమోనని వచ్చాను. అయిన ఆ కాలేజీకీ ప్రాబ్లమ్ వస్తే రిషి ఎందుకు వెళ్ళాడు. నువ్వు ఎందుకు వెళ్ళావని ఏంజిల్ అడుగుతుంది. కాలేజీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా అని ఏంజిల్ అనగానే .. సాల్వ్ చేశారు అని వసుధార చెప్తుంది. రిషి తన భార్య గురించి పదిహేను రోజుల్లో చెప్తానన్నాడు కదా తన భార్య ఎవరో నువ్వు గెస్ చేయగలవా? రిషి భార్య గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటి ఉందని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత వసుధారని ఏంజెల్ తన ఇంటికి తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వసుధార, ఏంజిల్ ఇద్దరు హాల్లో పడుకొని ఉంటారు. రిషి తన గదిలో నుండి బ్యాగ్ తో వస్తుంటే వసుధార చూసి ఏంజిల్ కి చెప్తుంది. రిషి ఎక్కడికీ వెళ్తున్నావని ఏంజిల్ అడుగుతుంది. నేను ఇక ఈ ఇంట్లో ఉండాలనుకోవడం లేదని రిషి చెప్పగానే.. వద్దు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలని ఏంజిల్ రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు నాకు ఫ్రెండ్ వి.. నీ దృష్టిలో నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రావడం తప్పని రిషి అంటాడు. నువ్వు నా ఫ్రెండ్ వి కాదని అనట్లేదు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నీకు పెళ్లి అయిందన్నావ్. పదిహేను రోజులు గడువు ఇచ్చాను. నువ్వు వెళ్ళకు రిషి. నీ ముందు ఆ టాపిక్ తియ్యనని రిషిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంజిల్. అలా చెప్పిన రిషి వినకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.