English | Telugu

పెళ్ళిలో సమంత తొడిగిన డైమండ్ రింగ్ ఎక్కడిదో తెలుసా 

-రింగ్ ఎక్కడిది!
-స్పెషల్ ఏంటి!
-ఆ చక్రవర్తులకి సంబంధం ఏంటి!



రూమర్స్ సృషించే వాళ్ళకి వాల్యూ ఇస్తూ స్టార్ హీరోయిన్ సమంత(Samantha),ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)నిన్న వివాహ బంధంతో కొత్త జీవితానికి స్వాగతం పలికిన విషయం తెలిసిందే. తమిళనాడు కోయంబత్తూర్ లోని లింగ భైరవి ఆలయంలో వివాహం జరగగా ఇరువైపు సన్నిహితులు హాజరయ్యి నూతన దంపతులని ఆశీర్వదించారు. వివాహ వేడుక సందర్భంగా సమంత ,రాజ్ ధరించిన కాస్ట్యూమ్స్ అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమంత తన చేతికి ధరించిన డైమండ్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో అభిమానులతో పాటు నెటిజెన్స్ సదరు డైమండ్ రింగ్ ప్రత్యేకతల గురించి ఇంటర్ నెట్ లో సెర్చ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో అభిలాషాప్రెట్ జ్యువెలరి షాప్ కి చెందిన' అభిలాషా బండారి' (Abhilash Bandari)మాట్లాడుతు సమంత ధరించిన రింగ్ 'పోట్రెయిట్ కట్ డైమండ్'. వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్ చేసి పలుచని గాజు పలకలా తయారు చేస్తారు. బలం, తేజస్సు, స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా ఈ తరహా డైమండ్ రింగ్స్ నిలుస్తాయి. ఫస్ట్ టైం ఈ తరహా రింగ్స్ ని మొఘలుల కాలంలో తయారు చేసారు. తాజ్ మహల్ ని నిర్మించిన షాజహాన్ భార్య 'ముంతాజ్' కి ఈ రకమైన ఉంగరాలు ఇష్టమని చరిత్రలో రాసి ఉందని చెప్పుకొచ్చాడు. బండారి చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:అఖండ 2 కోసం పూజలు జరిపిస్తున్న జగన్

ఇక రాజ్, సమంత కి పలువురు సినీ, వ్యాపార,రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెప్తున్నారు. రాజ్, సమంత ఇద్దరికి రెండో వివాహం అనే విషయం తెలిసిందే.