English | Telugu
పవన్‌కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఒక్క సినిమా కూడా ఆడదు
Updated : Dec 2, 2025
ప్రస్తుతం కోనసీమ ఉన్న స్థితి గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ నేతల్లో, ప్రజల్లో దీనిపై వ్యతిరేకత కనిపిస్తోంది. కొందరు బాహాటంగానే పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా మాట్లాడారు. పవన్‌కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
'పవన్ కల్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధపెట్టాయి. ఈ విషయంలో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి తగలడం కాదు, ఆంధ్రా పాలకుల వల్లే తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారు. పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోతే అతను నటించిన సినిమా ఒక్క థియేటర్‌లో కూడా విడుదల కాదు. అయితే చిరంజీవి మంచివాడు. కానీ, పవనకళ్యాణ్‌కి రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల అలా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా తన వ్యాఖ్యల గురించి క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే ఇక్కడ అతని సినిమా ఆడదు' అంటూ వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.