English | Telugu
Guppedantha Manasu : జగతి లేదన్న విషయం తెలుసుకున్న అనుపమ.. ఏం చేయనుంది?
Updated : Nov 14, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -920 లో.. అనుపమ ఏర్పాటు చేసిన అల్యూమిని ఫంక్షన్ కి ఎలాగైనా మహేంద్ర, జగతిలని తీసుకొని రమ్మని రిషితో అనుపమ చెప్తుంది. దాంతో మహేంద్రకి రిషి తెలియకుండా అల్యూమిని ఫంక్షన్ కి తీసుకొని వస్తాడు. మహేంద్ర అక్కడకి వెళ్లగానే ఎందుకు తీసుకొని వచ్చావంటూ అడుగుతాడు. వెనక్కి వెళదాం పదా అని మహేంద్ర అంటాడు. డాడ్.. ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారని రిషి అంటాడు.
ఆ తర్వాత ఇక్కడ ఎవరు లేరని మహేంద్ర అంటుండగా.. అప్పుడే అనుపమ వచ్చి ఇక్కడ ఎవరు లేరా అంటూ అడుగుతుంది. ఆ తర్వాత మహేంద్ర ఫ్రెండ్స్ అందరు వచ్చి మహేంద్రని బలవంతంగా తీసుకొని వెళ్తారు. ఏంటి రిషి మీ అమ్మని కూడా తీసుకొని రమ్మని చెప్పాను కదా ఎందుకు తీసుకొని రాలేదు ఇంకా వాళ్లిద్దరి మధ్య దూరం అలాగే ఉందా? నువ్వు, వసుధర ఎలా కలిసి ఉంటున్నారో మీ అమ్మ నాన్న కలిసి ఉండాలని లేదా అని రిషిని అనుపమ అడుగుతుంది. జగతి గురించి రిషి చెప్పబోతుండగా.. ఎవరో వచ్చి పిలిస్తే తర్వాత మాట్లాడుకుందామంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అనుపమ స్టేజి పైకి వెళ్లి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంది. మరొకవైపు అల్యూమిని ఫంక్షన్ కి విశ్వనాథ్, ఏంజిల్ లు కూడా వస్తారు. వాళ్ళని రిషి, మహేంద్ర, వసుధార చూస్తారు. మీరు ఇక్కడ ఏంటని అడుగుతారు. అప్పుడే డాడ్ అంటూ అనుపమ రావడం చూసి.. రిషి, వసుధార మహేంద్ర షాక్ అవుతారు. తను మా నాన్న అని అనుపమ చెప్పగానే.. మరి నాకు చెప్పలేదని రిషి అంటాడు. చెప్పే అవసరం రాలేదు అయిన నువ్వు అన్ని విషయాలు మాకు చెప్పావా ఏంటని విశ్వనాథ్ అంటాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ బలవంతం చెయ్యడంతో మహేంద్ర స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడుతాడు. జగతి గురించి చెప్తూ మహేంద్ర ఎమోషనల్ అవుతు మాట్లాడలేకపోతాడు.
ఆ తర్వాత మహేంద్ర పక్కకి వెళ్ళిపోవడంతో.. అనుపమ, రిషి, వసుధార, విశ్వనాథ్ మరియు ఏంజిల్ కలిసి మహేంద్ర దగ్గరికి వెళ్తారు. అసలు ఎందుకు ఇలా అయ్యావ్? జగతి గురించి ఎందుకు చెప్పడం లేదని అనుపమ అడుగుతుంది. అయిన మహేంద్ర సైలెంట్ గా ఉంటాడు. జగతి గురించి చెప్పమంటూ మహేంద్రపై అనుపమ అరుస్తుంటే.. " చెప్పడానికి మేడమ్ ఉంటే కదా, చనిపోయారు" అని వసుధార చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. కాసేపటికి మహేంద్ర కూడా జగతి చనిపోయిందని చెప్పగానే అనుపమ నమ్మలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.