English | Telugu
ఎద్దులతో అలాగే మాట్లాడతా...డాన్స్ క్లాస్ కి వెళ్తున్నా!
Updated : Nov 14, 2023
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం చిన్నారి వైష్ణవి డాన్స్ కి జడ్జి ఇంద్రజ ఫుల్ ఫిదా ఐపోయింది. ఐపోవడమే కాదు ఇంద్రజాను కామెంట్ చేసిన ఆదికి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ వారం ఆది వన్ మ్యాన్ షో మాత్రం షోలో అందరి చేతా బీభత్సంగా తిట్లు కూడా తిన్నాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్న అందరూ కూడా ఏదనిపిస్తే అది తిట్టేసారు. ఇక ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న "లింగిడి లింగిడి" సాంగ్ కి తనకు తానే డాన్స్ ని కంపోజ్ చేసుకుని పెర్ఫార్మ్ చేసింది చిన్నారి వైష్ణవి.
ఇక ఈమె చిట్టి చిట్టి స్టెప్స్ కి ఇంద్రజ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసింది. డాన్స్ ఐపోయాక "అసలా డాన్స్ ఏమిటి కొరియోగ్రాఫర్ ఎవరూ లేరు కదా..నువ్వే చేసుకున్నావ్ కదా..నా బంగారం..ఎంత బాగా కంపోజ్ చేసుకున్నావో సాంగ్ కి డాన్స్..అసలు ఈ మూవ్మెంట్స్ అన్నీ ఎలా వస్తున్నాయి" అని అడిగేసరికి "డాన్స్ క్లాస్ కి వెళ్తున్నా" అని చెప్పింది వైష్ణవి. "ఎంత బాగా చేసావ్ రా నువ్వు..మధ్యలో ఒక స్టెప్ దగ్గర గ్యాప్ వచ్చినా కానీ నువ్వు దాన్ని పట్టించుకోకుండా డాన్స్ కంటిన్యూ చేసావ్ చూడు అది సూపర్ ..ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడా తగ్గలేదు " అని చాల ఎగ్జాయిట్ మెంట్ తో చిన్నపిల్లలా మాట్లాడుతూ అడిగేసరికి..ఆది సడెన్ గా మైక్ తీసుకుని "ఇంద్రజ గారు మీరెందుకు చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు " అని కావాలనే అడిగేసరికి "అంటే పిల్లలతో మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడాలి..కొన్ని ఎద్దులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతా" అని రివర్స్ కౌంటర్ గట్టిగా ఇచ్చేసింది. ఆ కామెంట్ ని తీసుకోకుండా "ఐతే వర్షతో మాట్లాడండి" అంటూ ప్లేట్ అటు ఫిరాయించాడు ఆది.