English | Telugu

Krishna Mukunda Murari: ముకుంద చేసిన ఆరోపణలో కృష్ణ బలి కానుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -314 లో.. నందు గౌతమ్ ఇద్దరు ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరికి కృష్ణ, తన చిన్నాన్న గురించి నెగటివ్ గా చెప్తుంది భవాని. అయిన నందుకి కృష్ణ తప్పు చెయ్యదనే నమ్మకం ఉంటుంది‌. ఆ విషయం క్లారిటీ కోసం రాత్రి రేవతి దగ్గరికి వస్తుంది నందు‌. అది అంత వాళ్ళు చేశారంటే నమ్మలేక పోతున్నానని రేవతి అంటుంది. మురారి గతం మర్చిపోయిన కూడా కృష్ణ తనకి గుర్తు ఉందని రేవతి చెప్తుంది.

ఆ తర్వాత మురారి హాస్పిటల్ నుండి వచ్చాక.‌. నేను అమ్మని, తను పెద్దమ్మ అంటూ మేమే పరిచయం చేసుకున్నాం కానీ కృష్ణ గురించి ఏం చెప్పకుండానే మురారి తనకు దగ్గర అవుతున్నాడని రేవతి చెప్తుంది. నీకు కృష్ణపై నమ్మకం ఉంటే వాళ్ళని కలిపే ప్రయత్నం చేయమని నందుని రిక్వెస్ట్ చేస్తుంది రేవతి. సరే నేను శకుంతల అత్తయ్య దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం తెలుసుకుంటనానని నందు చెప్తుంది. మరొకవైపు కృష్ణ ముకుంద ఇద్దరు ఎప్పటిలాగే.. నా ప్రేమ గొప్పది అంటే నా ప్రేమ గొప్పది అంటూ వాదనకి దిగుతారు. మరొక వైపు నందు శకుంతల దగ్గరికి వచ్చి అసలేం జరిగిందని అడిగి తెలుసుకుంటుంది. అప్పుడే షాపింగ్ పూర్తి చేసుకొని కృష్ణ కూడా ఇంటికి వస్తుంది. కృష్ణని చూసి నందు దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంటుంది. షాపింగ్ దగ్గర మురారి తనకి ఫేవర్ గా ఉన్నాడని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతూ నందుకి చెప్తుంది.

మరొక వైపు మధు, నందు గౌతమ్ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడే భవాని కోపంగా వచ్చి.. ముకుంద మురారి ఇద్దరు షాపింగ్ కి వెళ్తున్నారని కృష్ణకి ఎవరు చెప్పారని అడుగుతుంది. మధు, రేవతి ఇద్దరు మేం చెప్పలేదని అంటారు. అప్పుడే మురారి ముకుంద షాపింగ్ నుండి వస్తారు. మురారి దగ్గరకి నందు వెళ్లి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణ, శకుంతలలు మాట్లాడుకుంటుండగా.. మురారి వెళ్లి కృష్ణ ని బయటకు తీసుకొని వచ్చి రింగ్ గిఫ్ట్ ఇస్తాడు. కాసేపటికి కృష్ణ వేలుకి రింగ్ తొడుగుతాడు మురారి. అదంతా ముకుంద చూసి షాక్ అవుతుంది. తరువాయి భాగంలో ఇంట్లో పూజకు కృష్ణ కూడా వస్తుంది. మురారికి చెరొక పక్క కృష్ణ ముకుంద కూర్చొని ఉంటారు.

మురారి పెట్టిన రింగ్ చూసి కృష్ణ మురిసిపోతుంటే.. నిన్న నేను ఒక రింగ్ కొనుకున్నా అది కన్పించడం లేదు కృష్ణ వేణి గారు పెట్టుకున్న రింగ్ నాదే అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మరి రింగ్ మురారినే గిఫ్ట్ ఇచ్చానని అందరి ముందు చెప్పగలడా? లేక ముకుంద చేసిన ఆరోపణలో కృష్ణ బలి కానుందా? తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.