English | Telugu

కౌంట్ డౌన్ మొదలయ్యింది... నటి రాధ అల్లుడు ఎవరో తెలుసా?


అందాల నటి రాధ అంటే చాలు ఆమె చిరంజీవితో నటించిన ఎన్నో హిట్ మూవీస్ గుర్తొస్తాయి. అలాంటి రాధకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దమ్మాయి కార్తీక నాయర్, రెండో అమ్మాయి తులసి నాయర్. ఇక ఇప్పుడు పెద్ద కూతురు కార్తీక తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమే. అక్కినేని నాగచైతన్య నటించిన ఫస్ట్ మూవీ ‘జోష్’తో కార్తీక హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘రంగం’ మూవీతో సూపర్ హిట్ అందుకుంది కార్తీక‌.

ఇక ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాల్లో కూడా నటించారు. ఐతే హీరోయిన్‌గా టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయిన కార్తీక చివరిగా 2015లో ఓ తమిళ సినిమా ద్వారా వెండితెరపై కనిపించి ఆ త‌ర్వాత మూవీస్ కి బైబై చెప్పింది. ఇక ఇప్పుడు ఆమె పెళ్ళికి రెడీ అయ్యింది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఐతే అబ్బాయిని మాత్రం అస్సలు చూపించలేదు. అబ్బాయిని అటు తిప్పి, ఇటు తిప్పి రకరకాల యాంగిల్స్ లోనే చూపించారు కానీ ఫుల్ పిక్ చూపించలేదు.

ఇక కూతురు పెళ్లి కోసం రాధ కూడా సెలబ్రిటీస్ అందరినీ కలుస్తూ పెళ్లికి ఇన్వైట్ చేసే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు కార్తీక తన కాబోయే భర్తతో ఉన్న పిక్స్ కొన్నిటిని షేర్ చేసి అమేజింగ్ కామెంట్ పోస్ట్ చేసింది. "నిన్ను కలవడం డెస్టినీ... నీ ప్రేమలో పడిపోవడం ఒక మాయాజాలం...మనం కలిసుండబోయే క్షణాలకు కౌంట్‌డౌన్ మొదలయ్యింది..." అంటూ టాగ్ లైన్ పెట్టుకుంది. ఇక వీళ్ళ పిక్స్ చూసిన మోనాల్ గుజ్జర్ "మీ ఇద్దరి పెళ్లి కోసం వెయిటింగ్" అంటూ కామెంట్ చేసింది. మిగతా నెటిజన్స్ కూడా కంగ్రాట్యులేషన్స్..కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న మీకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.