English | Telugu

సుధీర్ ఎవరు అన్న భాస్కర్..హద్దుల్లో ఉండాలంటూ ఫాన్స్ వార్నింగ్

సుడిగాలి సుధీర్ కి ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. అలాంటి సుధీర్ ని బులెట్ భాస్కర్ కామెంట్ చేసేసరికి సుధీర్ ఫాన్స్ బులెట్ భాస్కర్ కి సోషల్ మీడియాలో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో చూస్తే తెలుస్తుంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది.

ఇందులో స్కిట్స్ తో పాటు ఒక స్పెషల్ సెగ్మెంట్ ని చేశారు కమెడియన్స్. "గుద్దితే గులాబ్ జామ్ ఛానల్" పేరు పెట్టి బులెట్ భాస్కర్ ని, నాటీ నరేష్ ని ఇంటర్వ్యూ చేసింది సత్య. "మీకేమన్న లవ్ అఫైర్స్ ఉన్నాయా" అని భాస్కర్ ని అడిగేసరికి "రష్మీ నా గర్ల్ ఫ్రెండ్" అనేసరికి అందరూ ఆ మాటకు షాకయ్యారు. వెంటనే సత్య తేరుకుని "మరి సుధీర్, రష్మీ" అని అడిగింది.."ఎవ్వడీ సుధీర్" అని రివర్స్ లో అడిగాడు భాస్కర్.

"రీసెంట్ గా ఏదో సినిమా వచ్చింది కదా" అనేసరికి "భోళా శంకర్" అని చెప్పాడు నాటీ నరేష్. "ప్రసాద్ అంకుల్ తో నేను మాట్లాడించి పెట్టించాను" అని భాస్కర్ ఎక్కువ కట్టింగ్ ఇచ్చాడు. వెంటనే "ప్రసాద్ అంకుల్ ఎవరు" అని నరేష్, సత్య అడిగేసరికి "చిరంజీవి గారు..శివ శంకర వరప్రసాద్..ఆయన్ని నేను ప్రసాద్ అంకుల్ అని పిలుస్తా" అని చెప్పేసరికి ఖుష్బూ నోరెళ్లబెట్టింది. "నాకు పేరు పెట్టింది అమితాబచ్చన్ అంకుల్..అప్పుడు జయ ఆంటీ కూడా వచ్చారు" అని భాస్కర్ అనేసరికి "జయ అంటే జయ బచ్చన్ ఆంటీ" అని క్లారిటీ ఇచ్చాడు.

"ఆరోజు బారసాలకు మీరు కూడా వచ్చారు ఆంటీ" అంటూ ఖుష్భుని అడిగేసరికి ఆమె స్టేజి మీద నుంచి లేచి భాస్కర్ ని కొట్టడానికి వెళ్లారు.."అంటీ అంటే బాధగా ఉందా మరి నన్ను తమ్ముడు అని పిలిచినప్పుడు నేనెంత బాధ పడ్డాను" అన్నాడు భాస్కర్. ఈ స్కిట్ ఇలా సాగితే సుధీర్ మీద భాస్కర్ కామెంట్ కి నెటిజన్స్ మండిపడ్డారు. "బులెట్ భాస్కర్ నీ హద్దుల్లో ఉండు..సుధీర్ అన్న ఫాన్స్" అంటూ కామెంట్స్ లో వార్నింగ్ ఇచ్చారు.