English | Telugu
Rathika Rose : రతిక పెట్టిన చిచ్చుబుడ్డి అమర్, యావర్ ల మధ్య పేలింది!
Updated : Nov 15, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికి పది వారాలు పూర్తి చేసుకుంది. ఇక పదకొండవ వారం నామినేషన్ లు సోమవారం మొదలవ్వగా, మంగళవారం నాడు ముగిసాయి. ఇందులో పల్లవి ప్రశాంత్, శివాజీ తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు.
ఇక నామినేషన్ లో నా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అమర్ దీప్ ని అశ్వినిశ్రీ నామినేట్ చేసింది. ఇక శోభాశెట్టి డామినేట్ గా మాట్లాడిందని అది తనకి నచ్చలేదని అంది. అశ్వినిశ్రీ శోభాశెట్టి నామినేట్ చేసింది. శోభాశెట్టిని యావర్ నామినేట్ చేశాడు. అంబటి అర్జున్ ని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. ఇక అమర్ దీప్ చేసిన నామినేషన్ హాట్ టాపిక్ గా మారింది.
ఎప్పటివో.. రెండు, మూడు వారాలలో జరిగిన వాటికి పదకొండో వారం నామినేషన్ చేయడం సిల్లీగా ఉందంటూ యావర్ ని అమర్ దీప్ నామినేట్ చేశాడు. అది సిల్లీ కాదని యావర్ అన్నాడు. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. " రతిక.. బయటకు వెళ్లొచ్చిన దానివి ఎవరిపై ఇలాంటి పాయింట్లు చెప్పకు" అని అమర్ దీప్ అన్నాడు. తవ్వుకుంటూ పోతే అందరి జాతకాలూ అంతే. ఎవరివీ ఏమంత గొప్ప జాతకాలు కావు అని అన్నాడు అమర్ దీప్.
ఇక యావర్.. బిహేవియర్‌గా గురించి మాట్లాడటంతో.. రతికతో నేను చెప్పింది చూశావా.. అంటూ యావర్ మీదికి దూసుకుని వెళ్లాడు అమర్ దీప్. ఇక ఇద్దరు కొట్లాటకి దిగడంతో.. కెప్టెన్‌గా ఉన్న శివాజీ వెళ్లి ఇద్దర్నీ ఆపేశాడు. మొత్తానికి రతిక పెట్టిన చిచ్చు.. అమర్, యావర్ లు ఒకరినొకరు కొట్టుకునేంత స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత గౌతమ్‌ని నామినేట్ చేశాడు శివాజీ. ఆవేశం తగ్గించుకోవాలని గౌతమ్ కి చెప్పాడు శివాజీ. ఎమోషనల్ లైక్ లూజ్ మోషన్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఫ్లోను ఆపలేమని గౌతమ్ అనగా.. మోషన్ రాకపోయిన వచ్చినట్టు చేయలేం కదా, అది మంచిది కాదు కదా.. దాన్నే కంట్రోల్ చేసుకోవాలి అదే నీకు మంచిదిరా అని శివాజీ అన్నాడు.