English | Telugu

వాడు రావట్లేదు... నేను వేరే వాళ్ళకి కమిట్ అవ్వట్లేదు!

అరియాన.. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ లోకి వచ్చిన బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది అరియాన.. అరియాన మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం, అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది..

అరియానాని తన ఫ్యాన్స్ జూనియర్ ఇలియానా అని అంటూ పొగుడుతుంటారు. నిన్న మొన్నటి వరకు ఫ్రెండ్స్ తో ఫారెన్ ట్రిప్ అంటూ తెగ ఎంజాయ్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొన్ని రోజులుగా అరియాన హాట్ షో సాగుతూనే ఉంది. తరచుగా సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియోతో వైరల్ ట్రెండింగ్ లో ఉంటుంది ఈ భామ. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో.‌. లెట్స్ టాక్ అంటూ ముచ్చటించింది. తన ఫ్యాన్స్ కొన్ని ఆసక్తికరమైన క్వశ్చన్స్ అడగ్గా అరియాన పాజిటివ్ గా స్పందించింది.

అమర్ గురించి కొన్ని మాటలు అని అడగ్గా.. రెండు, మూడు వేలు అప్పు అడుక్కునే దాన్ని, అప్పటి నుండి ఇప్పుటివరకు మా ఫ్రెండ్ షిప్ సాగుతుంది. దానితో పాటుగా అమర్ పెళ్లి అవుతుంటే ఇంట్లో ఆడపడుచులు లేరని నన్ను తీసుకొని వెళ్లాడని అరియాన చెప్పుకొచ్చింది.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని ఒక అభిమాని ప్రశ్నించగా..

పెళ్లి చేసుకోవాలి అనే ఉంది కానీ అబ్బాయిలు ఖాళీ లేరు. ఒకరిది పది సంవత్సరాల లవ్, ఇంకొకరిది రెండు సంవత్సరాల లవ్.. ఎవ్వరిని టచ్ చేసినా ఇవే సమాధానాలు. ఎవరో గట్టిగా కోరుకుంటున్నట్టున్నారు వారి లైఫ్ లోకి నేను రావాలని, వాడు రావట్లేదు నేను వేరే వాళ్ళకి కమిట్ అవ్వలేకపోతున్నానని అరియాన అంది. అయితే బిగ్ బాస్ సీజన్-7 లో టాప్-5 లో ఎవరుంటారని ఒకరు అడుగగా.. యావర్, శివాజీ, ప్రశాంత్ ఖచ్చితంగా ఉంటారు. ఇక యావర్ లేదా గౌతమ్ గానీ నాల్గవ స్థానంలో ఉంటారు. ఇక అయిదవ స్థానం బ్లాంక్ గా వదిలేద్దామని అరియాన అంది.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.