English | Telugu

బాత్రూంలోనూ బిగ్ బాస్ ఆది రెడ్డికి అదే పని... నెల సంపాదన 39 లక్షలు!


బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే ఆది రెడ్డి రెమ్యూనరేషన్ కళ్ళు తిరిగే రేంజ్ లో ఉంది. ఎందుకంటే ఈ నెల 39 లక్షల డబ్బు వచ్చింది. దాని వెనక ఎంత కష్టం ఉందో కూడా ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ నిద్రపోయేటప్పుడు మాత్రమే తానూ నిద్రపోయి మిగతా టైం అంతా కూడా రివ్యూస్ ఇచ్చేవాడినని చెప్పారు. అంటే గట్టిగ పడుకునేది నాలుగైదు గంటలే అని చెప్పాడు. ఈ రివ్యూస్ కోసం భార్యాపిల్లలతో మాట్లాడకుండా ఉన్న ఎన్నో రోజులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. బాత్రూంలోకి వెళ్లినా కూడా బిగ్ బాస్ లైవ్ చూస్తూనే ఉంటా. పిన్ టు పిన్ నోట్ చేసుకుని చెప్పబట్టే బిగ్ బాస్ మీద పస్సిఒన్ ని పెంచుకోబట్టే ఇంత సక్సెస్ వచ్చిందన్నాడు.

తక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు ఎందుకు చూపించకూడదు ఈ ఇన్కమ్ చూసాక కూడా పెయిడ్ అని ఎవరన్నా అనుకుంటే ఇంకేం చేయలేదు. ఒక వీడియో చేస్తే డబ్బులు వస్తాయని తెలుసు..అలాంటప్పుడు పెయిడ్ అని అంటే ఇంకేమన్నా మాట్లాడతాము అన్నాడు ఆదిరెడ్డి. తనకు ఏది అనిపిస్తే అదే చెప్తానన్నాడు. తనకు కొనగలిగే వాళ్ళు ఉన్నారా అన్నాడు. తానూ ఎంతో మందికి హెల్ప్ చేసినట్టు చేప్పాడు. సబ్స్క్రైబర్స్ కి చెప్పినంత మాత్రాన ఏమవుతుంది అందుకే తన శాలరీ ఎంతో చెప్పేసానన్నాడు ఆదిరెడ్డి. ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, యూకె నుంచి చూసే వాళ్లందరికి థ్యాంక్స్ అని చెప్పాడు. అలాగే తనకు హెల్ప్ చేసిన వాళ్లకు హెల్ప్ చేస్తానని...కొత్తగా యూట్యూబ్ చానెల్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటె వాళ్లకు సాయం చేస్తానని చెప్పాడు ఆది రెడ్డి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.