English | Telugu

Guppedantha Manasu: నీది నాది ఒకే కథ.. అటు అత్త ఇటు కోడలు!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -921 లో.. జగతి గురించి చెప్పమని మహేంద్రని అనుపమ నిలదీస్తుంటే.. అది వసుధార చూడలేక జగతి లేదన్న నిజాన్ని చెప్తుంది. అది విని అనుపమ షాక్ అవుతుంది. ఆ తర్వాత మహేంద్ర కూడా జగతి చనిపోయిందని చెప్పగానే అనుపమ ఏడుస్తు తన ఫ్రెండ్ షిప్ ని గుర్తుకు చేసుకుంటుంది.

ఆ తర్వాత అనుపమ ఎమోషనల్ అవుతు.. నా జగతిని నువ్వే చంపేసావా? అసలేం జరిగింది నువ్వు దూరంగా ఉన్నావని బాధతో అలా అయిందా అని మహేంద్రని అనుపమ అడుగుతుంది. ఆ తర్వాత మా అమ్మ నా వల్లే చనిపోయింది. డాడ్ కి సంబంధం లేదు. నన్ను కాపాడే క్రమంలో అమ్మకి అలా జరిగిందని రిషి చెప్తాడు. డాడ్ అమ్మని చాలా ప్రేమగా చూసుకున్నారని రిషి చెప్తాడు. ఆ తర్వాత మహేంద్రని తీసుకొని రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొక వైపు అక్కడ జరిగింది మొత్తం విశ్వనాథ్, ఏంజిల్ చూస్తారు.. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది విశ్వం అని విశ్వనాథ్ తో ఏంజిల్ అంటుంది. మరొకవైపు మహేంద్ర అనుపమ అన్న మాటలు గుర్తుకు చేసుకొని కారు ఆపమని రిషికి చెప్తాడు. కారు దిగి మహేంద్ర ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంటాడు. జగతిని గుర్తుకు చేసుకొని మహేంద్ర బాధపడుతాడు. ఏం బాధపడకండి అంటూ మహేంద్రకి రిషి, వసుధార చెప్తారు. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు అనుపమ గురించి అడుగుతారు. మహేంద్ర, అనుపమ, జగతిల ఫ్రెండ్ షిప్ గురించి చెప్తాడు. ఇంట్లో వాళ్ళని ఎదిరించి మా పెళ్లి చేసింది అనుపమ అని మహేంద్ర చెప్తాడు.

మరొక వైపు అనుపమ దగ్గరికి విశ్వనాథ్, ఏంజిల్ వస్తారు. అసలు జగతి లేదు అన్న విషయం నాతో మహేంద్ర ఎందుకు చెప్పలేదు. అసలు జగతిని ఎవరు చంపేసారు. ఆ అవసరం ఎవరికి ఉంది. వీళ్ళు దాని గురించి పట్టించుకోవడం లేదా అని అనుపమ అనగానే.. రిషి వదిలి పెట్టాడు. రిషి గురించి మాకు తెలుసు. ఇంకా జగతి, మహేంద్ర కూడా మన ఇంటికి వచ్చారని ఏంజిల్ చెప్తుంది. నువ్వు అప్పట్లో మహేంద్ర గురించేనా అని విశ్వనాథ్ ఏదో చెప్పబోతుంటే.. గతం వద్దు డాడ్ అని అనుపమ ఆపేస్తుంది. ఇంచుమించు మీ అత్త జీవితం నీ జీవితం ఒకేలా ఉన్నాయని విశ్వనాథ్ అంటాడు. నీ బాధ నాకు అర్థం అయింది.

అత్తయ్య రిషి తన గురించి చెప్పకుండా అన్ని విషయాలు దాచినప్పుడు నేను ఇలాగే బాధపడ్డానని ఏంజిల్ తన మనసు అనుకుంటుంది. మరొకవైపు నా దగ్గర మహేంద్ర ఈ విషయం దాచిపెడతాడని అసలు ఉహించలేదని అనుపమ అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం వసుధార లేవకుముందే రిషి లేచి వంట చేస్తుంటాడు. మీరు ఎందుకు చేస్తున్నారు? అసలు మీకు ఇక్కడ ఏం ఉంటాయో తెలుసా అని రిషితో వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.