English | Telugu
Brahmamudi : బాయ్ ఫ్రెండ్ తో భార్య దిగిన ఫోటోలు బయటపెట్టిన భర్త!
Updated : Nov 15, 2023
స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -254 లో.. కళ్యాణ్ ముందుగా గుడ్ న్యూస్ అని అప్పుతో షేర్ చేసుకోవాలని అప్పు, అనామికలని ఒక దగ్గరికి రమ్మని చెప్తాడు. ఇంట్లో వాళ్ళు అనామికతో పెళ్లి చెయ్యడానికి డేట్ ఫిక్స్ చెయ్యాలని అనుకుంటున్నారని అనగానే.. అనామిక వెళ్లి కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. అప్పు ఆ మాట విని తన ఎమోషన్ కంట్రోల్ చేసుకొని కళ్యాణ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
మరొక వైపు కాలేజీ డేస్ లో స్వప్నని ప్రేమించిన అతనిని రాహుల్ కలిసి మాట్లాడతాడు. నాతో లేచిపోయి వచ్చిందని తెలిసి కూడా నువ్వు స్వప్నని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావ్ ఎందుకు? నీకు స్వప్నకి మధ్య రిలేషన్ ఏంటి అని అడగ్గానే అతను బయపడతాడు. ఒకప్పుడు ప్రేమించాను కానీ ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదని అతను అంటాడు. లేదు కానీ మీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్టు అందరూ అనుకునేలా నువ్వు చెయ్యాలి.
అలా చేస్తే నువ్వు హాస్పిటల్ పెట్టాలి అనుకుంటున్నావ్ కదా. అందుకు నేను పర్మిషన్ ఇప్పిస్తానని అనగానే అతను ఒప్పుకుంటాడు. మరొక వైపు దుగ్గిరాల ఇంట్లోని హాల్లో.. సారి కళావతి అని బోర్డుపై రాసి ఉంటుంది. అలా ఉండడం చూసిన అందరు.. రాజ్ ఏంటి ఇలా రాసాడని అనుకుంటారు. కానీ అది రాసింది కావ్య. కావ్య ఏం తెలియనట్లు వచ్చి.. ఏంటి ఇది ఎవరు రాసారని అడుగుతుంది. ఇంకెవరు నీ భర్త అని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే రాజ్ వస్తాడు. రాజ్ ఎందుకు అలా రాసావ్ కావ్య ఎదరుగానే ఉంది కాదా అని ధాన్యలక్ష్మి అంటుంది. రాజ్ ఎలాగూ నేను రాయలేదని అందరి ముందు చెప్పలేడు. రాజ్ ఏం చెయ్యలేక సారి చెప్పబోతుంటే కావ్య తన నటన మొదలు పెట్టి.. ఎందుకు సారీ అంటూ అనగానే.. ఏం నటిస్తున్నావే అని రాజ్ తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత రాజ్ వెళ్ళిపోతాడు.
ఒకవైపు అప్పు తన గదిలో ఏడుస్తుంటుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాను. కంగ్రాట్స్ చెప్పకుండా వచ్చిందని కనకంతో కళ్యాణ్ చెప్పగానే.. అలా ఎందుకు చేసిందంటూ అప్పుని తిడుతుంది కనకం. అప్పు ఇష్టం లేకున్నా బలవంతంగా గదిలో నుండి బయటకు వచ్చి కళ్యాణ్ తో కోపంగా మాట్లాడుతుంది. అసలు అప్పుకి ఏమైంది అని కళ్యాణ్ కనకం ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత అప్పు గదిలోకి వెళ్లి కళ్యాణ్ ఫోటో చూస్తూ ఏడుస్తుంటుంది. మరొక వైపు ఎందుకు ఇలా చేసావని కావ్యని రాజ్ అడుగుతాడు. తరువాయి భాగంలో రాహుల్ స్వప్న బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసిన కుట్రలో భాగంగా.. స్వప్న తన కాలేజీ డేస్ లో బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోస్ ని కొరియర్ ద్వారా దుగ్గిరాల ఇంటికి పంపిస్తాడు. అవి చూసిన ఇందిరాదేవి.. అతను తెలుసా అంటూ స్వప్నని అడుగుతుంది. మరి స్వప్న ఆ సమస్య నుండి ఎలా బయటపడనుంది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.