English | Telugu
Krishna Mukunda Murari: దీపావళి సెలబ్రేషన్స్ లో ప్రమాదం పొంచి ఉందా?
Updated : Nov 15, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -315 లో.. మురారి ఎవరికి తెలియకుండా కృష్ణని బయటకు తీసుకొని వచ్చి రింగ్ గిఫ్ట్ ఇస్తాడు. మురారి స్వయంగా కృష్ణ వేలికి తొడుగుతాడు. అదంతా చాటుగా చూసిన ముకుంద.. నేను ఇలా చూస్తూ ఉంటే సరిపోదు. ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటుంది. ఈ విషయం పెద్ద అత్తయ్యకి చెప్పకుండా ఒకటే సారి బ్లాస్ట్ చెయ్యాలని ముకుంద అనుకుంటుంది.
ఆ తర్వాత ముకుంద భవాని దగ్గరకు వచ్చి.. కృష్ణపై ఇంకా కోపం కలిగేలా మాట్లాడుతుంది. షాపింగ్ మాల్ లో జరిగిన విషయలు మొత్తం భవానికి ముకుంద చెప్పి.. తనని మొత్తం నెగెటివ్ గా చేస్తుంది. ఆ తర్వాత నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు అని ముకుందకి భవాని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం దీపావళి సందర్భంగా ఇంట్లో పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ తర్వాత ముకుంద మురారిలు పై నుండి కలిసి వస్తుంటే వాళ్లని చూసి భవాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతు.. వాళ్ళని అలా చూస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత నందుతో ముకుంద, మురారి లను ఫోటో తీయమని భవాని చెప్తుంది. కృష్ణ ఇంకా రాలేదు అని మురారి బయటకు వెళ్లి చూస్తుంటాడు. కాసేపటికి కృష్ణ వస్తుంది మురారికి చెరొక పక్క కృష్ణ ముకుంద కూర్చొని ఉంటారు. కృష్ణ వేలికి ఉన్నా రింగ్ ని చూస్తూ మురిసిపోతుంది. అది చూసి ఓర్వలేకపోతుంది ముకుంద.
ఆ తర్వాత ముకుంద తన కన్నింగ్ ప్లాన్ తో.. నిన్న నేను ఒక రింగ్ తీసుకున్నాను. అది కన్పించడం లేదని భవానితో చెప్తుంది. కృష్ణ పెట్టుకున్న రింగ్ నాదే అని ముకుంద అనగానే అందరు షాక్ అవుతారు. మురారి నిజం చెప్పబోయి ఆగిపోతాడు. నేనే కొని ఇచ్చానని చెప్తే ఇంట్లో అందరూ ఎందుకు కొని ఇచ్చావని తిట్టాలని ముకుంద ప్లాన్ అనుకుంటా అని మురారి అనుకుంటాడు. అలాగే కృష్ణ కూడా అలాగే అలోచించి నిజం చెప్పకుండా ఆగిపోతుంది.
ఆ తర్వాత అవును ఈ రింగ్ నేను దొంగతనం చెయ్యలేదు. నాకు బయట దొరికింది అని కృష్ణ అనగానే.. ఇవ్వమని ముకుంద అంటుంది. కృష్ణ రింగ్ తియ్యడానికి ప్రయత్నం చేస్తుంటే అది రాదు. అప్పుడే మురారి తియ్యబోతుంటే భవాని వద్దని చెప్తుంది. తరువాయి భాగంలో.. భవాని ఇంట్లో అందరూ దీపావళి జరుపుకుంటు ఉంటారు. అప్పుడే కృష్ణ కొంగుకి నిప్పు అంటుంకుంటుంది. దాంతో మురారి కాపాడతాడు. అసలు భవాని తీసుకున్న నిర్ణయం ఏంటి? మురారి తను గిఫ్ట్ ఇచ్చిన విషయం చెప్పనున్నాడా.. తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.