English | Telugu

Rathika Rose: గోడ మీద పిల్లిలా రతిక.. కన్ ఫ్యూజన్ లో అంబటి అర్జున్!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా మారుతుంది. గత వారమంతా ఫ్యామీలీ వీక్ సాగింది. ఇక ఆ వీక్ 'ఓ బేబీ' టాస్క్ లో గెలిచిన అర్జున్, శివాజీలలో హౌస్ మేట్స్ శివాజీని కెప్టెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక గతవారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు.

ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగా సాగింది‌. హౌస్ లో పది మంది ఉంటే శివాజీ, ప్రశాంత్ తప్ప మిగిలిన ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. హౌస్ లో " ఎవిక్షన్ ఫ్రీ పాస్" గురించి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మీలో మీరు డిసైడ్ చేసుకొని ఎవరు ఏ స్థానంలో ఉండాలనుకుంటారో బిగ్ బాస్ కి చెప్పండని అనగా.. శివాజీ, ప్రశాంత్, యావర్ మొదటి మూడు స్థానాలకి వచ్చారు. నాల్గవ స్థానంలో ప్రియాంక, అయిదవ స్థానంలో శోభాశెట్టి, ఆరవ స్థానంలో అమర్ దీప్, ఏడవ స్థానంలో అంబటి అర్జున్, గౌతమ్, అశ్వినిశ్రీ, రతిక చివరి స్థానాలలో ఉన్నారు. అయితే హౌస్ లో ఆక్టివ్ గా లేని రతికకి పదో స్థానం ఇచ్చారు., శోభా శెట్టికి ఏడవ స్థానం, అమర్ దీప్ కి నాల్గవ స్థానం ఇచ్చినట్టు తెలుస్తుంది.

అయితే ఇలా హౌస్ మేట్స్ తమ అభిప్రాయాలు చెప్పేటప్పుడు రతిక-అర్జున్, అర్జున్-శోభాశెట్టి మధ్య పెద్ద గొడవ జరిగింది. శోభాశెట్టి ఇండివిడ్యువల్ గా ఆడట్లేదని గ్రూప్ గా ఆడుతుందని ఫేవరిజం, లక్కు ఉన్నాయని చెప్పి అందుకే ఏడవ స్థానం ఇస్తున్నాని అర్జున్ చెప్పగా.. శోభా ఏడుస్తూ ప్రియాంక, అమర్ దీప్ లకి చెప్పుకుంది. గోడ మీద పిల్లిలా మెజారిటీ సభ్యలు చెప్పారని చెప్పడమేంటని రతిక మీద కోప్పడ్డాడు యావర్. మరి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి వస్తుందో చూడాలి. అయితే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికైతే వస్తుందో వారికి ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యే అవకాశం లభిస్తుంది. లేదా తనకి నచ్చిన ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేషన్ నుండి సేవ్ చేసే ఛాన్స్ లభిస్తుంది. అందుకే దీనికోసం హౌస్ మేట్స్ అంత పోటీపడుతున్నారు. ఉల్టా పల్టా అంటూ కంటెస్టెంట్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాడు బిగ్ బాస్.

హౌస్ మేట్స్ అంతా కలిసి ఒకటి నుండి పది వరకు ర్యాంకింగ్స్ ఇచ్చుకున్నాక బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. మీలో వీకెస్ట్ అని భావించిన బాటమ్-5 కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పొటీ పడే అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తున్నాడు. అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, అంబటి అర్జున్, రతిక, అశ్వినిశ్రీ బాటమ్-5 లో ఉన్నారు. వీరికి బిగ్ బాస్ 'ఎవిక్షన్' అని ఇంగ్లీష్ లెటర్స్ సరిగ్గా అమర్చమనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ పోటీకి సంచాలకుడిగా కెప్టెన్ శివాజీ ఉన్నాడు. ఎవిక్షన్ ఫ్రీ అని అయిదుగురు అమర్చిన అందులో అందరివి మిస్టేక్స్ ఉన్నాయి. వీటిలో తక్కువ మిస్టేక్ ఉన్నది అంబటి అర్జున్ కాబట్టి ఈ టాస్క్ లో అంబటి అర్జున్ గెలిచాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని శివాజీ తన చేతుల మీదుగా అందించాడు. అయితే ఇక్కడే బిగ్ బాస్ అసలైన ఉల్టా పల్టా ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. గెలిచిన అంబటి అర్జున్ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని కాపాడుకోవడానికి టాప్-5 లోని కంటెస్టెంట్స్ తో పోటీ పడాల్సి ఉంటుందని చెప్పాడు.

దీంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు‌. ఎవరినో సేవ్ చేయడానికి ఇంత ఆడాలా? లేక నన్ను సేవ్ చేసుకోవడానికి ఈ గేమ్ ఆడాలా అని శివాజీతో అంబటి అర్జున్ అన్నాడు. ఇక నేటి ఎపిసోడ్‌లో అంబటి అర్జున్ - పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ లతో పోటీ పడనున్నాడు. మరి ఈ టాస్క్ లో అంబటి అర్జున్ గెలిచి తనకొచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని కాపడుకుంటాడా లేక కోల్పోతాడా తెలియాలంటే టాస్క్ లు పూర్తి అయ్యేవరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.