English | Telugu
టాప్ ఓటింగ్ తో శివాజీ దూకుడు.. అట్టడుగున గౌతమ్, అంబటి అర్జున్!
Updated : Nov 24, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ కి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. గతవారం ఫ్యామిలీ వీక్ లో కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చి గట్టిగానే చెప్పారు. అప్పటి నుండి కంటెస్టెంట్స్ బాగా ఆడుతున్నారు.
ప్రస్తుతం హౌస్ లో ఉన్నవాళ్ళలో ఎవరు అనర్హులనే లిస్ట్ తీస్తే.. రతిక, గౌతమ్, అంబటి అర్జున్ లు ముందుంటారు. ఎందుకంటే రతిక వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం.. ల్యాగ్ చేయడం.. ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. ఇక అశ్వగంధ అలియాస్ గౌతమ్ కృష్ణ చేసే సిల్లీ నామినేషన్ వల్ల నెగెటివ్ అయ్యాడు. ఇక శివాజీని టార్గెట్ చేస్తూ ప్రతీ దానికి శివాజీనే ఫోకస్ చేసి నామినేషన్ చేయడం ఒకటైతే అంబటి అర్జున్ కన్నింగ్ ప్లాన్ ని గుర్తించకుండా అతనేం చెప్పిన నమ్మడంతో పాటుగా తన ఇండివిడ్యువల్ గేమ్ ని మర్చిపోయాడు గౌతమ్. అశ్వినిశ్రీ టాస్క్ లో పర్వాలేదనిపించిన ఒక్క గేమ్ విన్ అవ్వకపొవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్.. వీళ్ళు ముగ్గురు ఎక్కడికెళ్ళిన, ఏ గేమ్ అయిన కలిసే ఆడతారని అందరికి తెలిసిందే.
అయితే నామినేషన్ లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లలో శివాజీకి అత్యధిక ఓటింగ్ తో నెంబర్ వన్ ర్యాగింగ్ లో ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. మూడవ స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. ఇక చివరి స్థానాలలో రతిక, గౌతమ్, అంబటి అర్జున్ ఉన్నారు. అశ్వినిశ్రీ కి ఓటింగ్ బాగానే ఉంది. ఇక శోభాశెట్టి, ప్రియాంక నామినేషన్ లో లేకపోవడంతో వాళ్ళు సేఫ్ అయ్యారనే చెప్పాలి లేదంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళేవారు. శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వాలని బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గౌతమ్, అర్జున్ లు ఈ డబుల్ ఎలిమినేషన్ లో బయటకు వస్తారో లేక రతికని బయటకి పంపిచేస్తారా చూడాలి మరి.