English | Telugu
శోభాశెట్టి వర్సెస్ శివాజీ.. అమ్మ నాన్న కూడా ఆశ పెట్టుకున్నారు!
Updated : Nov 25, 2023
బిగ్‌బాస్ సీజన్-7 రోజు రోజుకి ఎవరూ ఊహించని విధంగా మారుతుంది. హౌస్ లో ఫ్యామిలీ వీక్ వరకు ఓ లెక్క.. ఆ తర్వాతి నుంచి మరో లెక్క అన్నట్లుగా గేమ్ సాగుతుంది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నువ్వా నేనా అన్నట్టుగా హౌస్ మేట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ సాగాయి.
కంటెస్టెంట్స్ కి ఒకే ఒక్క కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి ఏకాభిప్రాయంతో ఒక్కరిని రేస్ నుండి తప్పించి మరొకరిని ముందుకు కొనసాగించాలని బిగ్ బాస్ చెప్పగా.. యావర్, రతిక కలిసి ప్రశాంత్ ని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించారు. శోభాశెట్టి, ప్రశాంత్ కలిసి అశ్వినిశ్రీని తప్పించారు. యావర్, అశ్వినిశ్రీ కలిసి గౌతమ్ ని తప్పించారు. ఇలా ఒక్కొక్కరిని తప్పించగా.. చివరకు అర్జున్, అమర్ దీప్ కెప్టెన్సీ రేస్ లో నిలిచారు. ఇక వీరిలో ఎవరు కెప్టెనో డిసైడ్ చేయడానికి శివాజీ, శోభాశెట్టి వచ్చారు. అమర్ దీప్ కి సపోర్ట్ గా శోభాశెట్టి, అంబటి అర్జున్ కి సపోర్ట్ గా శివాజీ నిల్చున్నారు. నాకు గతవారం కెప్టెన్సీ టాస్క్ లో నన్ను గెలిపించాడు కాబట్టి నా సపోర్ట్ అమర్ దీప్ కి అని శోభాశెట్టి అంది. కానీ శివాజీ మాత్రం అర్జున్‌కి ఒక కోరిక మిగిలిపోయిందంటూ.. వాళ్ళ భార్య హౌస్ లోకి వచ్చినప్పుడు అర్జున్ ని మరోసారి కెప్టెన్ గా చూడాలనుకున్నట్టు చెప్పిందని చెప్పాడు. "అర్థం చేసుకో అన్నా.. ప్లీజ్ ఇప్పుడు అవకాశం వచ్చింది. పోగొట్టకు అన్నా.. నీకు దండం పెడతా అన్నా.. మా అమ్మ నాన్న కూడా ఆశ పెట్టుకొని ఉంటారు అన్నా" అంటు ఏడ్చాడు అమర్ దీప్. ఏం చేయమంటావురా.. ఏడుస్తావేంటి? రేపు టికెట్ టూ ఫినాలే ఉంది. దమ్ముంటే ఆడి గెలువు అంటూ సవాల్ చేశాడు. కానీ అమర్ మాత్రం అన్నా కెప్టెన్ అవ్వాలన్నా నేను అంటూ గట్టిగా అరిచాడు. నిన్ను ఎవడు ఆపాడయ్యా అని శివాజీ అన్నాడు. ఇక అర్జున్ కూడా.. ఎందుకురా ఏడుస్తావ్. కెప్టెన్ అవ్వకపోతే కప్పు రాదా? కెప్టెన్ ముఖ్యమా? కప్పు ముఖ్యమా అని చెప్పాడు. ఇక ఒక పక్కకి వెళ్ళి ఏడ్చేశాడు అమర్ దీప్.
ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోమని బిగ్ బాస్ చెప్పగా.. అమర్ దీప్ కి సపోర్ట్ గా శోభాశెట్టి, అంబటి అర్జున్ కి సపోర్ట్ గా శివాజీ నిల్చున్నారు. ఇక ఇద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరిగిన ఫలితం రాకపోయేసరికి.. మీకు ఇచ్చిన సమయం పూర్తయింది. మీరేం నిర్ణయం తీసుకోనందువల్ల ఇద్దరిని కెప్టెన్సీ రేస్ నుండి తీసేస్తున్నాం. ఇక ఈ వారం నో కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పేశాడు.