English | Telugu

Brahmamudi : భార్యని గెంటేయాలనుకున్న భర్త.. స్పృహతప్పి పడిపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -262 లో... అరుణ్ కి స్వప్న డబ్బులు ఇచ్చి ఇంటికి తిరిగి వస్తుంది. స్వప్న ఎప్పుడు వస్తుందా? తనకి సంబంధించిన బాయ్ ఫ్రెండ్ విషయం ఇంట్లో చెప్పాలని రాహుల్ వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. ఎక్కడికి వెళ్ళావంటూ రాహుల్ గట్టిగా అరుస్తుంటే ఇంట్లో వాళ్ళంతా హాల్లోకి వస్తారు.

ఆ తర్వాత స్వప్నని ఎక్కడికి వెళ్ళావంటు రాహుల్ నిలదీస్తాడు. బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నానాని నాతో చెప్పి వెళ్ళిందని రుద్రాణి గొడవని ఇంకా పెద్దగా చెయ్యాలని చూస్తుంది. వెళ్ళింది బ్యూటీ పార్లర్ కాదు. ఇది ఎవడితోనో తిరిగి వస్తుంది. మనల్ని అందరిని మోసం చేస్తుందని రాహుల్ అనగానే.. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అవును నేను చెప్పింది నిజం కావలంటే ఫొటోస్ చూడండి అని చూపించగానే ఇంట్లో అందరూ చూస్తారు. అతను నా కాలేజీ ఫ్రెండ్ మాత్రమే అని స్వప్న అనగానే.. అయితే ఆ రోజు నేను అతని ఫోటో చూపించినప్పుడు తెలియదని చెప్పావ్ కాదా అని ఇందిరాదేవి అనగానే ఇదిగో ఇలాగే అనుకుంటారని చెప్పలేదని స్వప్న చెప్తుంది. ఆ తర్వాత ఇప్పటికి అతన్ని కలుస్తుంది. మొన్న ఇంటికి పిలిపించుకొని మాట్లాడిందని రాహుల్ అనగానే.. అవును నేను చూసానని రాజ్ చెప్తాడు. మరి ఇంట్లోకి పిలిచి మాట్లాడాలి కదా ఫ్రెండ్ అయితే అని ఇందిరాదేవి అనగానే.. నేను లోపలికి పిలవలేదు తను రాలేదని స్వప్న సమాధానం చెప్తుంది.

ఆ తర్వాత స్వప్నని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించాలని రాహుల్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్ ని కలిసి డబ్బులు ఇచ్చి వస్తుంది. దానికి సాక్ష్యం అని చెప్పి అరుణ్ కి స్వప్న డబ్బులు ఇస్తున్నప్పుడు చాటుగా తీసిన ఫొటోస్ ని అందరికి చూపిస్తాడు రాహుల్. నీకు అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చిందని రుద్రాణి అడగుతుంది. తన నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చింది. ఇదిగో రిసీప్ట్ అని రాహుల్ సాక్ష్యం చూపించగా ఎవరు మాట్లాడలేకపోతారు. ఆ తర్వాత స్వప్న ఎందుకు ఇలా చేసిందోనని, అరుణ్ తనని బ్లాక్ మెయిల్ చేసాడని, అందుకే అలా చేశానని స్వప్న చెప్తుంది. ఇంత జరుగుతున్న మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని స్వప్నని అపర్ణ అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి నిజంగానే సంబంధం ఉందని రాహుల్ అంటాడు. నేను ఎవరు చెప్పిన వినను అని స్వప్నని రాహుల్ బయటకు గెంటేయబోతుంటే.. స్వప్న కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..