English | Telugu
Gautham Krishna Eliminated: గౌతమ్ కృష్ణ ఎలిమినేటెడ్.. ఏడుస్తున్న రతిక, అశ్వినిశ్రీ!
Updated : Nov 25, 2023
బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం నడుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ గత సీజన్ లలో జరిగిన దాని ప్రకారం పదిహేనవ వారం ఎలిమినేషన్ ఉండదు. మధ్యలో మిగిలింది రెండే వారాలు. కానీ హౌస్‌లో ఉన్నది పది మంది. వచ్చే వారం ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేస్తే మిగిలేది ఎనిమిది మంది. పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. దాంతో ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయొచ్చు కానీ ఈ సీజన్ లో ఉల్టా పల్టా థీమ్ తో బిగ్ బాస్ డేంజర్ జోన్ లోని ఒకరిని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేస్తాడేమోనని అనిపిస్తుంది.
ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లలో.. శివాజీ, ప్రశాంత్, యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అండ్ ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు టాప్-5 లో కచ్చితంగా ఉంటారు. అయితే టాప్-5 లో ఆ నాలుగు, అయిదు స్థానాలలో ఎవరుంటారనేది అందరిలో మిగిలిన ప్రశ్న. అమర్ దీప్ గత వారం జరిగిన టాస్క్ లో ఏడ్చేశాడు. దాంతో అతని మీద ఫౌల్స్ ఆడతాడన్న మచ్చ పోయి కాస్త పాజిటివ్ ఎపిసోడ్ వచ్చిందనే చెప్పాలి. ఇక సీరియల్ బ్యాచ్ లోని అతి ముఖ్యమైన కంటెస్టెంట్ ప్రియాంక. తన స్ట్రాటజీతో మైండ్ గేమ్ తో ఎదుటివారిని మాట్లాడనీయకుండా చేస్తూ హౌస్ లో అమర్ దీప్, శోభాశెట్టి లని తన గుప్పిట్లో పెట్టుకుందనేది వాస్తవం. ఇక అశ్వగంధ అలియాస్ గౌతమ్.. ఇంకా హౌస్ లో ఎందుకున్నాడో ఎవరికీ అర్థం కానీ పరిస్థితి. ఆ ఫేక్ అంబటి అర్జున్ ఒక్క నామినేషన్ లో మాత్రమే రీజన్స్ చెప్పి.. ఎవరితో ఏమీ మాట్లాడకుండా తన పనేదో తను చూసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇదే విషయం స్పష్టం చేస్తూ యావర్ నామినేట్ కూడా చేశాడు. దీంతో ఈ వారం గౌతమ్, అర్జున్ ఇద్దరు ఎలిమినేషన్ అవుతారని అందరు భావిస్తున్నారు. అయితే రతిక, అశ్వినిశ్రీ కూడా కంటెంట్ కోసం తప్ప గేమ్స్ లో జీరో ఎఫర్ట్స్ చూపిస్తున్నారు.
ఒకటి రెండు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఇతర అన్ అఫీషియల్ పోల్స్‌లో తప్ప అన్నింటిలో గౌతమ్, రతిక లీస్ట్ లో ఉన్నారు. కొన్నింటిలో అశ్వినిశ్రీ, గౌతమ్ లీస్ట్ లో ఉన్నారు. మొత్తానికి ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యే చాన్స్ లు చాలానే ఉన్నాయి. మరి బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటూ పల్లవి ప్రశాంత్ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ యూజ్ చేపించి, డబుల్ ఎలిమినేషన్ కాకుండా సింగిల్ ఎలిమినేషన్ చేస్తాడా చూడాలి మరి.