English | Telugu
Bigg Boss Promo: పల్లవి ప్రశాంత్ బూతులపై నాగార్జున ఫైర్!
Updated : Nov 25, 2023
బిగ్ బాస్ సీజన్-7 పన్నెండవ వారం ముగింపుకి వచ్చేసింది. అయితే గతవారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పడంతో ఈ రోజు ప్రోమోపై భారీ అంచనాలు పెరిగాయి. నిన్నటి కెప్టెన్సీ టాస్క్ లో అంబటి అర్జున్, అమర్ దీప్ లలో ఏ ఒక్కరు కెప్టెన్ గా కాలేకపోయారు. కాబట్టి దీని గురించి హోస్ట్ నాగార్జున శోభాశెట్టి, శివాజీలకి క్లాస్ తీసుకుంటారని అందరు అనుకుంటున్నారు.
ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్న ఈ రోజు ప్రోమో రానే వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ బూతులు మాట్లాడతావా అని నాగార్జున అడిగాడు. ఏం మాట్లాడలేదు సర్ అని ప్రశాంత్ అనగా.. దెయ్యం అయ్యాక నువ్వు అన్నావ్ కదా అని అడిగాడు. నేను కావాలని అనలేదు సర్. తప్పు అయితే సారీ అని కూడా చెప్పానని ప్రశాంత్ చెప్పాడు. ఎవరూ కావాలని అనరని నాగార్జున అన్నాడు.
ఆ తర్వాత అశ్వినిశ్రీని లేపి.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా సెల్ఫ్ నామినేషన్ అయ్యావా అని నాగార్జున అనగా.. అదేం లేదు సర్ అని అశ్వినిశ్రీ అంది. కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా అని నాగార్జున అనగా.. అశ్వినిశ్రీ ఏడుపు మొహం పెట్టేసింది. ఇక హౌస్ లో అడగాల్సినవి చాలా ఉన్నాయి. మరి అవన్నీ తర్వాతి ప్రోమోలో ఆడ్ చేస్తారో చూడాలి. ఇప్పటికైతే అశ్వినిశ్రీ, పల్లవి ప్రశాంత్ లకి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.