English | Telugu

శివాజీని అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసులు!


బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ జరుగుతుంది. ఇందులో బిగ్ బాస్ భార్య హత్యకు గురైంది. బిగ్ బాస్ భార్యని హత్య చేసిన మర్డరర్ ఎవరో కనిపెట్టమని కంటెస్టెంట్స్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్.

ఇప్పటికే ఉల్టా పల్టా ట్విస్ట్ లతో కంటెస్టెంట్స్ చేత ఒక ఆట ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. అయితే హౌస్ లో పది మంది ఉండగా అందులో శివాజీ ఒక్కడే తెలివితేటలతో, స్ట్రాటజీతో గెలుస్తున్నాడు. ఇక హౌస్ లోని వారికి ఒక్కో రోల్ ఇచ్చి ఆ పాత్రకి తగ్గట్టు చేయమని బిగ్ బాస్ కోరాడు. శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న వాళ్లని ఒక్కొక్కర్నీ మర్డర్ చేయమనగా మొదట పల్లవి ప్రశాంత్ ని డెడ్ చేసి విజయం సాధించాడు శివాజీ. ఆ తర్వాత గౌతమ్ ని డెడ్ చేయమనగా ఆ టాస్క్ ని ఇచ్చిన సమయంలో శివాజీ పూర్తి చేయలేకపోతాడు. ఇక ఆ బాధ్యతని ప్రియాంకకి ఇవ్వమని శివాజీతో బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత శివాజీ ఎవరికి తెలియకుండా ప్రియాంకకి తన దగ్గర ఉన్న ఫోన్ ని ఇస్తాడు. " ఐ ఆమ్ డెడ్" అనే స్టిక్కర్ ని గౌతమ్ కి వేసి డెడ్ చేయాలని ప్రియాంకతో బిగ్ చెప్పాడు. అమర్ దీప్ , అంబటి అర్జున్ పోలీసులుగా ఉండి.. ఒక్కోక్కరి ఇంటరాగేషన్ చేసి హంతకులెవరో కనిపెట్టారు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందని బిగ్ బాస్ పోలీసులైన అంబటి అర్జున్ , అమర్ దీప్ లని అడుగగా .. శివాజీ అని వాళ్లు చెప్పడంతో.. కారణాలేంటని శివాజీ అడిగాడు. ఎన్నడు లేనివిధంగా జోస్ అలుకాస్ రూమ్ లోకి వెళ్ళి పడుకొని శివాజీ కనిపించాడు. వాష్ రూమ్ కి, బయటకి ఎక్కువగా తిరిగాడు. అదీ కాక ప్రియాంకతో కలిసి చాణక్యుడులాగా ఏదో ప్లాన్ చేశాడని మాకు డౌట్ ఉందని అంబటి అర్జున్ చెప్పగా.. మీ డౌట్ నిజమే మర్డరర్ శివాజీనే అని బిగ్ బాస్ చెప్పాడు. కానీ అతను రెండు హత్యలకు మాత్రమే కారణం.. మిగిలిన రెండు హత్యలు చేసిన హంతకుడు మీ మధ్యలోనే ఉన్నాడని బిగ్ బాస్ వారితో చెప్పాడు. దాంతో అందరు షాక్ అయ్యారు. ఆ తర్వాత‌ పోలీసులు శివాజీని జైల్లో వేశారు.

ఇక శివాజీని జైల్లో వేసారు పోలీసులు. మళ్ళీ ఒక్కొక్కరిని ఇంటారాగేట్ చేసిన అమర్ దీప్ , అంబటి అర్జున్ లకి ప్రియాంకే హంతకురాలని తెలుస్తుంది. ఎవరు హంతకులని బిగ్ బాస్ అడుగగా.. ప్రియాంక అని అనుకుంటున్నామని పోలీసులు చెప్పారు. ఏంటి రీజన్ అని ప్రియాంక అడుగగా. . ఆపిల్ మీద అలా రాసి ఉందని సీక్రెట్ రూమ్ దగ్గర ఫస్ట్ చూసింది నువ్వే. అక్కడ నీకేం పని, యావర్ ని ఇన్ ఫ్లూయన్స్ చేసి వాష్ రూమ్ దగ్గరికి పంపించావని కారణాలు చెప్పారు పోలీసులు. మీ అనుమానం నిజమే రెండవ మర్డరర్ ప్రియాంకే అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత శివాజీ, ప్రియంక దగ్గర ఉన్న ఫోన్, గొలుసులని తీసుకున్నాడు బిగ్ బాస్. హౌస్ లో ప్రశాంత్, అశ్వినిశ్రీ, గౌతమ్, యావర్ లు ఇప్పటివరకు టాస్క్ లో డెడ్ అయ్యారు.