English | Telugu

సంచలక్ అంటే అదేమన్నా అర్జున అవార్డా బ్రో..


బిగ్ బాస్ సీజన్ 7 లో ఆట సందీప్ గేమ్ ఒక రేంజ్ లో ఆడారు. సీరియల్ బాచ్ తో పోటాపోటీగా తలపడ్డారు. బిగ్ బాస్ లోకి ఎవరు వెళ్లి గేమ్ ఆడి బయటకు వస్తారో వాళ్లకు దశ తిరుగుతుంది అనే ఒక కామెంట్ ఐతే ఉంది. మరి ఆట సందీప్ దశ కూడా తిరిగే ఛాన్స్ వచ్చేసింది. హౌస్ లోంచి రాగానే ఆయన నటించిన మూవీ "ది షార్ట్ కట్" రిలీజ్ కాబోతున్న విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా తన ఫాన్స్ కి షేర్ చేసాడు.

ఈ మూవీ పోస్టర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యింది. ఇక ఈ పోస్టర్ మీద "బెస్ట్ సంచలక్" అని రాసి బిగ్ బాస్ తెలుగు లోగోతో సహా పోస్ట్ చేసాడు. ఆ పోస్టర్ చూసిన సందీప్ వైఫ్ జ్యోతి "కంగ్రాట్యులేషన్స్ మై లవ్" అని కామెంట్ పెట్టేసరికి " మీ ఆయనకు చెప్పండి అమ్మ బెస్ట్ సంచలక్ ఏందీ. ఏదో అర్జున అవార్డులాగా పెట్టుకున్నాడు. పైగా చేసిన సంచలక్ లో కూడా అన్ని తప్పు డెసిషన్స్ తీసుకున్నాడు. ఒక దానిలో వేరే వాళ్ళ మాటలు విని చేసాడు" అని కౌంటర్ ఇచ్చారు ఒక నెటిజన్. అలాగే " సంచలక్ అనే పెట్టుకొనేసరికి సందీప్ ని నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. "సంచలక్ ఏందీ..ఏదో క్లాస్ లీడర్ లాగా , కొంచెం మెచ్యూరిటీతో పెట్టండి.

బెస్ట్ సంచాలక్కా...బ్రో సొంత డబ్బాలా ఉంది..సంచలక్ అని తీసేయ్ బ్రో..ఎం మాట్లాడుతున్నావ్ బ్రో నరాలు కట్ ఐపోతున్నాయి" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట‌ర్‌లో రివాల్వ‌ర్ పట్టుకుని సీరియస్ లుక్ లో ఆట సందీప్ కనిపించాడు. గ‌తంలో ఆట సందీప్ ల‌వ్ యూ టూ అనే మూవీలో నటించాడు. ఆట సందీప్ భార్య జ్యోతి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ప‌లు సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా ఆట సందీప్ వ‌ర్క్ చేశాడు. ఇక ఆట సందీప్ హౌస్ లోంచి బయటకు వచ్చి ఒక్కొక్కరిగా అందరి కంటెస్టెంట్స్ ని కలుస్తున్నాడు.