English | Telugu

సుమ పరువు తీసేసి..నన్ను వాడుకోండి అంటూ ఆఫర్ ఇచ్చిన గెటప్ శీను


సుమ అడ్డా లాస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ వారం షోకి "హనుమాన్" మూవీ టీమ్ వచ్చింది. ఇందులో హీరో హీరోయిన్స్ తేజ సజ్జ, అమృతా అయ్యర్, గెటప్ శీను, ప్రశాంత్ వర్మ వచ్చారు. రాగానే తేజ సజ్జ హనుమంతుడు గధను ఎత్తినట్టు ఆయన అరటిపండు గెలను ఎత్తేసరికి సుమ ఖుషి ఐపోయింది. తర్వాత "అమ్మా గెటప్ శీను ఆ గెలను తీసుకో" అనేసరికి శీను ఒక అరటిపండు తీసుకున్నాడు దానికి తేజ రియాక్ట్ అయ్యి "తీసుకో అంది పండును కాదు గెలను" అన్నాడు సీరియస్ గా. ఇంతలో అమృత అయ్యర్, సుమ ఇద్దరు బస్ స్టాండ్ లో కూర్చుని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.

ఇంతలో మరో వైపు నుంచి తేజ, ప్రశాంత్ వర్మ వాళ్లకు బీట్ కొడుతూ ఉంటారు. " ఆ అమ్మాయిని గమనించావా..బాగుంది కదా " అని తేజా అడిగేసరికి "బాగుంది..పర్పుల్ కలర్ డ్రెస్ లో చాలా బాగుంది" అని ప్రశాంత్ వర్మ అనేసరికి "సుమ గారు కాదు" అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మరీ ప్రశాంత్ వర్మని తిట్టాడు తేజ.."సైట్ కొట్టడంలో కూడా నాకు మర్యాద ఇస్తున్నారు వావ్" అంటూ సుమ ఫుల్ ఖుషీ ఐపోయింది. ఇంతలో అటుకేసి గెటప్ శీను వచ్చేసరికి "ఇదిగో అక్కడ ఇద్దరు నిలబడ్డారు కదా వాళ్ళు మా గురించి ఇందాకట్నుంచి కామెంట్స్ చేస్తున్నారు" అని సుమ అనేసరికి "ఎందులో యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తున్నారా " అనేసరికి సుమ షాకైపోయింది.

ఇంతలో గెటప్ శీను తన సూటుకేసిలో బోల్డంత కాష్ తీసుకెళ్తూ సుమ వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసి తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి వచ్చి డబ్బులు అన్నీ క్లీన్ చేయాలని చెప్పేసరికి సుమ వచ్చి ఆ డబ్బును చూసి ఇందాకటి నుంచి ఆ సూట్కేస్ లో కట్ డ్రాయర్లు బనీన్లు ఉన్నాయన్న డబ్బు ఉందని తెలీదు ఎందుకు ఈ డబ్బును మేం క్లీన్ చేస్తాం అని చెప్పేసరికి "ఏమిటి మీరు క్లీనర్సా" అని అడిగి సుమ పరువు తీసేసాడు గెటప్ శీను. తర్వాత అమృతను పటాయించాడు శీను .."హలో ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ యూజ్ మీ" అనేసరికి ఆమె షాకయ్యింది. ఇలా ఈ వారం సుమ అడ్డాలో వీళ్లంతా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..