English | Telugu

ఆది స్ట్రెస్ ని తగ్గిస్తూ హగ్గులిచ్చిన ఆఫ్రికన్ వనిత..

శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది మాట్లాడితే చాలు హగ్గులిచ్చేసింది ఒక ఆఫ్రికన్ వనిత..ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ ని ఫారెనర్స్ స్పెషల్ గా డిజైన్ చేశారు. అందులో కొంతమంది ఫారెనర్స్ ని మల్లెమాల టీమ్ తీసుకొచ్చింది. ‘ఇఫ్ ఐయామ్ ఇన్ స్ట్రెస్.. యు గివ్ హగ్.. దెన్ ఐయామ్ రిలాక్స్’ అని హైపర్ అది అనగానే ఆ ఆఫ్రికన్ అమ్మాయి వచ్చి హగ్గులిచ్చేసి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ‘అందరికీ మన ఇండియన్ సంప్రదాయాలు నచ్చి ఇక్కడి అమ్మాయిలను పెళ్లిచేసుకుంటామని ఇండియాకు వచ్చారు మా ఫారన్ ఫ్రెండ్స్ ’ అని వాళ్లందరినీ ఆది పరిచయం చేశాడు. సరే మరి "నీ ఫారెన్ ఫ్రెండ్స్ కి ఇండియన్ అమ్మాయిలను చూపిస్తున్నావు.. నీకేంటి లాభం" అని బుల్లెట్ భాస్కర్ అడిగేసరికి ‘మా ఫ్రెండ్స్‌కి ఇండియన్ అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేస్తే, నాకు ఫారెన్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు’ అందుకే ఇదంతా అని చెప్పాడు. ఇంతలో స్టేజి మీద ఒక ఆఫ్రికన్ నల్ల పోరి వచ్చి ‘ఖుషి’లో ‘నా రోజా నువ్వే.. నా లవర్ నువ్వే’ అని పాడింది.. ‘నా లవ..’ అనే బూతు ఆమె నోట్లోంచి వచ్చేసరికి షాకై పక్కకు వెళ్ళిపోయాడు ఆది.

ఇదంతా చూసిన జడ్జి ఇంద్రజ మైక్ అందుకుని.. ‘ఇలాంటివన్నీ మాట్లాడినందుకే ఇక్కడ ఎవ్వరూ అమ్మాయిలు దొరక్క అక్కడికి వెళ్లి పట్టుకున్నారు ఒకతిని’ అని కౌంటర్ వేశారు. తర్వాత బుల్లితెర యాక్టర్స్ అంతా వచ్చి నైటీల్లో డాన్స్ ఇరగదీశారు. ఫైనల్ గా ఒక నల్ల పోరడు వచ్చి గులాబీ పువ్వు తెచ్చి రష్మీకి లవ్ ప్రొపోజ్ చేసే సెగ్మెంట్ ని పెట్టి సీన్ ని రక్తి కట్టించారు. రష్మీకి ఆటను గులాబీ ఇచ్చి "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటూ తెలుగులో ప్రపోజ్ చేశాడు. ఇక ప్రోమో ఫైనల్ లో డాన్సర్ పండు, బుల్లితెర నటి అంకిత పెళ్లి సందడి జరిగింది. పెళ్లి తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపించాడు పండు. ఇక ఈ ప్రోమో చూసాక నెటిజన్స్ ఒక రేంజ్ లో తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. "ఫామిలీస్ తో చూసేలా ఎపిసోడ్స్ చేయండి ...మిడ్ నైట్ మసాలాలు కాదు.. ఫస్ట్ నైట్ ఎపిసోడ్ కూడా ఒకటి టెలికాస్ట్ చేయండి" అని రెప్లైస్ ని పోస్ట్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.