English | Telugu

ఆదిరెడ్డి సెలూన్ లో గీతూ పిచ్చుక గూడు జుట్టుకు కలర్...

బిగ్ బాస్ రివ్యూలతో ఫేమస్ అయిన గీతూ రాయల్ అంటే సోషల్ మీడియాలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బుల్లితెర షోస్ తో పాటు జబర్దస్త్ వేదికపై కూడా మెరిసింది. అంతేకాదు బిగ్ బాస్ 6లో కూడా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఒక రేంజ్ లో ఆ సీజన్ ని రక్తి కట్టించింది. బిగ్ బాస్ సీజన్ 6 అంటే చాలు ఆడియన్స్ కి గీతూ రాయల్ మాత్రమే గుర్తొస్తుంది. అంతలా ఏడ్చి అల్లరి చేసి ఎలిమినేట్ ఐనా కూడా హౌస్ లోంచి రాను అంటూ మారాం చేసింది ఈ అమ్మడు. ఇక హౌస్ లోంచి వచ్చాక కొద్ది రోజులకు తేరుకుని తన ఫ్రెండ్స్ అందరితో కలిసిపోయింది.

గీతూ రాయల్ ఆదిరెడ్డికి మంచి ఫ్రెండ్ కూడా ఐపోయింది. వీళ్ళు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. మరి అలాంటి గీతూ విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్ లో రీసెంట్ గా స్టార్ట్ చేసిన జావేద్ హబీబ్ హెయిర్ సెలూన్ కి వచ్చింది. తన జుట్టుకు రకరకాల రంగులు వేసుకునేసరికి పిచ్చుకు గూడులా మారిపోయింది జుట్టు. అందుకే ఇప్పుడు ఆదిరెడ్డి సెలూన్ లో ఆ కలర్ మార్పించుకున్నట్లు చెప్పింది. "ఆదిరెడ్డి ఫ్రీగానే కదా హెయిర్ కలర్ వేసేది లాస్ట్ లో మళ్ళీ బిల్ వేయవు కదా" అనిగీతూ అడిగేసరికి దణ్ణం పెట్టాడు ఆదిరెడ్డి. "అంటే ఫ్రీ అన్నానని వచ్చావా" అని అడిగేసరికి "నేను ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తాను" అని చెప్పింది గీతూ.

"పర్లేదు నువ్వు కూడా మా తిరుపతి స్టడ్ అండ్ టాటూస్ కి వస్తే నీకు ఫ్రీగా టాటూస్ వేస్తా" అని ఆదిరెడ్డికి ఆఫర్ ఇచ్చింది గీతూ. "నా సెలూన్ లో నీ షాప్ పేరును ప్రమోట్ చేస్తున్నావన్నమాట" అన్నాడు ఆది ..."మీకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ మా ఆదిరెడ్డి సెలూన్ లో చేయించుకోండి" అని గీతూ చెప్పింది. "ఫ్రీ మాత్రం కాదు" అని ఆది అనేసరికి "అవును మీకు ఫ్రీ కాదు నాకు మాత్రమే ఫ్రీ" అంది గీతూ. "నీకు కూడా ఫ్రీ కాదు గీతూ" అని చెప్పేసరికి "ఐతే నేను రీల్ పోస్ట్ చేయడం లేదు నో ప్రమోషన్" అని మొహమాటం లేకుండా చెప్పేసింది గీతూ. ఇలా వీళ్ళ ప్రమోషన్ వీడియోని తమ తమ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పోస్ట్ చేసుకున్నారు..