English | Telugu

పల్లవి ప్రశాంత్, రతిక.. త్వరలో ఓ శుభవార్త!

బిగ్ బాస్ సీజన్‌ సెవెన్ విజేతగా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ప్రశాంత్ తో మొట్టమొదట స్నేహం చేసింది రతిక రోజ్. అయితే అది స్నేహమో, ఆకర్షణో మరేంటో ప్రేక్షకులకి ఇప్పటికి అర్థం కానీ ప్రశ్నే. అయితే ప్రశాంత్ మొదట్లో రతికతో కలిసి ముచ్చట్లు, లవ్ సింబల్ వేయడం, నా పిల్ల అని తోటి హౌస్ మేట్స్ తో చెప్పుకోవడం అంతా చూసి వాళ్ళిద్దరు లవ్ స్టోరీ నడిపిస్తున్నారని అందరు అనుకున్నారు.

అయితే రెండవవారం నామినేషన్ లో హౌస్ లో దాదాపు పదిమంది కంటెస్టెంట్స్ ప్రశాంత్ పై నామినేషన్ చేసారు. ఈ ఇష్యూలో రైతులు వర్సెస్ బిటెక్ స్టూడెంట్స్ అనే టాపిక్ పెద్ద ఎత్తున పాపులర్ అయి అమర్ దీప్ కి రైతులంతా నెగెటివ్ అయ్యారు. ఇక ఆ నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ హీరో అయ్యాడు. అయితే అదే నామినేషన్ లో.. బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి కుక్కలెక్క తిరిగానని పల్లవి ప్రశాంత్ అనగా.. మరి లోపలికి వచ్చి ఏం చేస్తున్నావని రతిక అంది. దాంతో మనోడికి ఫ్యూజ్ లు అవుటయ్యాయి. ఇదేంది ఇన్నిరోజులు లవ్ సింబల్ వేసింది, నా గుండెలో నీకే స్థానం అంది ఇప్పుడేంది అని ఇలా మాట్లాడుతుందని ప్రశాంత్ కి అర్థం కాక సైలైంట్ అయి కంటనీరు తెచ్చుకున్నాడు. ఈ ఇష్యూ తర్వాత శివాజీ వెళ్ళి ఓదార్చడంతో తన మనసు మార్చుకొని గేమ్ మీద దృష్టి పెట్టి చివరిదాకా ప్రతీ గేమ్ లో అంతే కసిగా పోరాడాడు ప్రశాంత్.

రతిక, ప్రశాంత్ లు కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత రతిక ఎలిమినేట్ అయింది బయటకు వచ్చేముందు అసలు ప్రశాంత్ వైపు కూడా చూడలేదు. ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి తప్పు తెలుసుకొని తనని అక్క అని పిలవొద్దని అంది. అయితే ప్రశాంత్ దానికి ఒప్పుకోలేదు‌.‌ ఇక శివాజీ వచ్చి ఇద్దరిని మంచి స్నేహితులుగా ఉండమని చెప్పడంతో అంతా సద్దుమణిగింది. అయితే బిగ్ బాస్ బయటకొచ్చాక రతిక ఓ ఇంటర్వూ లో ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. తనంటే ఎప్పుడు నాకు ఒకే అభిప్రాయం.. మనోడు.. మంచోడు నాకు బాగా కనెక్ట్ అయ్యాడని అంది‌. అయితే దీన్ని బట్టి ప్రశాంత్ అంటే రతికకి కూడా సంథింగ్ సంథింగ్ అని తెలుస్తోంది. మరి ప్రశాంత్, రతికలు మళ్లీ కలిసుస్తారా? కలిసి ఓ శుభవార్త చెప్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.