English | Telugu

సూపర్ సింగర్ కంటెస్టెంట్ వెంకటేష్ కి లక్ష ఇస్తానన్న రాహుల్ చిచ్చా...

సూపర్ సింగర్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో అనంత శ్రీరామ్, రాహుల్ చిచ్ఛ కలిసి కల్లు తాగి షోని కిక్కెకించారు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ మాత్రం తన ఉదారతను చాటుకున్నాడు. ఈ షోలో శ్రీకాకుళం నుంచి వెంకటేష్ అనే వ్యక్తికి లక్ష రూపాయలను ఇస్తున్నట్టు ప్రకటించాడు. వెంకటేష్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో "దారి చూడు దుమ్ము చూడు" సాంగ్ పాడి వినిపించాడు. తర్వాత అతని ఏవిని వెనక స్క్రీన్ మీద ప్లే చేశారు. "నేను జాబ్ చేయడం కోసమే వైజాగ్ వచ్చాను. పగటి పూట పాట్లు, రాత్రి పూట పాటలు..ఇదే నా జీవితం...దాని కోసం నేను మ్యూజిక్ అకాడెమీలో కూడా చేరాను. ఉదయం పూట ఫుడ్ డెలివరీ చేస్తూ వచ్చే డబ్బును మ్యూజిక్ క్లాస్ కి ఇచ్చేవాడిని..." అని చెప్పేసరికి "చాల ఇన్స్పైరింగ్ గా ఉంది బ్రో..నీ లైఫ్ సీరియస్లీ...నేను ఏ స్థాయి నుంచి వచ్చానో కూడా నాకు తెలుసు.

నేను ఒక బార్బర్ ని..ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను అంటే నాకు తెలుసు కింది స్థాయి కస్టాలు ఎలా ఉంటాయో...అందుకే నేను నీకు ఒక లక్ష రూపాయలు ఇద్దామనుకుంటున్నా నువ్వు మ్యూజిక్ నేర్చుకోవడానికి" అనేసరికి అందరూ చప్పట్లు కొట్టారు..ఇక శ్రీముఖి హనుమకొండ నుంచి వచ్చిన కంటెస్టెంట్ సుకుమార్ వీర అనే వ్యక్తితో కామెడీ స్కిట్ వేసి మంచి ఫన్ జెనెరేట్ చేసింది. "ఏంటి శ్రీముఖి" అని సుకుమార్ అడిగేసరికి "ఓహ్ మా ఆయనే..కానీ వాసన వస్తోంది" అనేసరికి "తాగుతానా శ్రీముఖి నేనెంతో సిన్సియర్ అనే విషయం నీకు తెలుసు కదా" అన్నాడు. "ఎన్నిసార్లు చెప్పమనండి మీరు తాగితే నాకు కూడా తీసుకురమ్మని చెప్పి" అనేసరికి కంటెస్టెంట్ షాకైపోయాడు. మంచి మంచి సింగర్స్ ఈ షోలో ఉండడం నిజంగా చాల గర్వంగా ఉందంటూ చెప్పింది జడ్జ్ శ్వేతా మోహన్...