English | Telugu

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ తో  లావ‌ణ్య త్రిపాఠి వెబ్ సిరీస్



అభిజిత్ అని చెప్తే ఎవరూ గుర్తుపట్టారు కానీ బిగ్ బాస్ సీజన్ 4 అభి అంటే గతంలోకి వెళ్లి మరీ గుర్తుచేసుకుంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ లా బిహేవ్ చేసి ఒక స్టైలిష్ ఆటిట్యూడ్ తో అఖిల్ తో పోటీ పడి మరీ టైటిల్ విన్ ఐన అభి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఈ సీజన్ విన్నర్‌ ఐన తర్వాత అభిజిత్‌కి ఇండస్ట్రీ నుంచి చాల ఆఫర్స్ వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోలేదు. ట్రావెలింగ్‌లో బిజీగా ఉండే అభి తన ఫ్యాన్స్‌కి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ ఆ పోస్టర్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్ స్టార్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు అభి . "మిస్ పర్ఫెక్ట్" అనే ఈ సిరీస్‌లో మెగా ఫామిలీ కోడలు లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో కనిపిస్తోంది. అలాగే అభితో పాటు గీతా సుబ్రహ్మణ్యం-3 ఫేమ్ అభిజ్ఞ్య కూడా కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజయిన ఈ పోస్టర్ లో లగేజి సూట్ కేస్ మీద లావణ్య త్రిపాఠి కూర్చొని ఉండగా వెనకాల అభి ల్యాప్ టాప్ పట్టుకొని క్యూట్ గా చూస్తూ ఉంటాడు. ఆ పక్కన అభిజ్ఞ్య నిల్చొని కనిపించింది . 'మిస్ పర్ఫెక్ట్ సార్ మిస్ పర్ఫెక్ట్' అంతే అంటూ ఈ పోస్ట్‌కి అభి క్యాప్షన్ పెట్టుకుంటే అభిజ్ఞ మాత్రం "ఏ ఫన్ రైడ్" అని కాప్షన్ ఇచ్చింది .

లావణ్య త్రిపాఠి మెగా ఫామిలీ కోడలిగా అడుగు పెట్టాక చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఇది లావణ్యకు సెకండ్ వెబ్ సిరీస్. ఫస్ట్ వెబ్ సిరీస్ ఏంటంటే జీ5లో 'పులి మేక'. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా లావణ్యా నటన అదిరిపోతోంది. ఇక ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక అభిజిత్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్‌లో ఓ రోల్ చేశాడు కానీ అది ఏమంత పెద్దగా అతనికి పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత వీటికి లాంగ్ గ్యాప్ ఇచ్చి తన ట్రావెలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాడు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ద్వారా మళ్ళీ అభి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.